భారీ వర్షాలు.. హోంమంత్రి ఇంట్లోకి వరద

తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. విజయవాడలో భారీ వర్షాలకుహోంమంత్రి అనిత ఇంటి చుట్టూ వరద చేరింది. రామవరప్పాడు వంతెన కింద ఆమె ఉండే కాలనీ జలదిగ్భందమైంది. ఆమె తన పిల్లల్ని ట్రాక్టర్ ఎక్కించి సురక్షిత ప్రాంతాలకు తరలించారు.  విపత్తు బృందం   ఆమె ఇంటి దగ్గరకు వచ్చి సహాయక చర్యలు చేపట్టాయి. 

ALSO READ | కరకట్టపై మునిగిన మంతెన ఆశ్రమం.. తాళ్ల సాయంతో బయటకొస్తున్న బాధితులు

భారీ వర్షాలకు విజయవడ నగరం అతలాకుతలం అయ్యింది. జనజీవనం స్తంభించిపోయింది. చాలా ప్రాంతాల్లో వరదల్ల చిక్కుకుపోయాయి.  పలు చోట్ల చిక్కుకుపోయిన ముంపు బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు అధికారులు.