![ఏపీ IAS కారు.. సూర్యాపేటలో పొలాల్లోకి దూసుకెళ్లింది](https://static.v6velugu.com/uploads/2024/11/ap-ias-car-rammed-into-fields-in-suryapet_lSpQxFRNVJ.jpg)
ఏపీ కార్మిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ వాణి ప్రసన్నకు తృటిలో ప్రమాదం తప్పింది. సూర్యాపేట జిల్లా మునగాల మండలంలోని ఆకుపాముల వద్ద వాణి ప్రసన్న ప్రయాణిస్తున్న కారు పంటపొలాల్లోకి దూసుకెళ్ళింది. మరో కారును ఓవర్ టేక్ చేస్తుండగా ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది.
హైదరాబాద్ నుండి విజయవాడ వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. అయితే.. కారు పొలాల్లోకి వెళ్లటంతో ప్రమాదం నుండి సురక్షితంగా బయటపడ్డారు వాణి. ఎటువంటి ప్రమాదం జరగకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. ఆమెను సూర్యాపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు.ఈ ఘటనకు డ్రైవర్ నిర్లక్ష్యమే కారణమా లేక ఇంకేదైనా కారణం ఉందా అన్నది తెలియాల్సింది.