
అమరావతి: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల అయ్యాయి. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఫలితాలను విడుదల చేశారు. ఇంటర్ ఫస్టియర్లో 70 శాతం, సెకండియర్లో 83 శాతం ఉత్తీర్ణత నమోదైనట్లు వెల్లడించారు. ఇంటర్ బోర్డు అధికారిక సైట్ ద్వారా విద్యార్థులు రిజల్ట్స్ చూసుకోవచ్చు. అంతేకాకుండా.. ప్రభుత్వం తీసుకొచ్చిన మన మిత్ర వాట్స్ యాప్ నంబర్ (9552300009) ద్వారా కూడా రిజల్ట్స్ తెలుసుకోవచ్చు.
ఏదైనా సందేహాలు, అభ్యంతరాలు ఉంటే సంబంధిత అధికారులను సంప్రదించాలని విద్యార్థులకు సూచించింది ఇంటర్ బోర్డు. కాగా, 2025 మార్చి 1 నుంచి 19 వరకు ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు జరిగిన విషయం తెలిసిందే. మార్చి 3 నుంచి 20 వరకు ఇంటర్ సెకండియర్ ఎగ్జామ్స్ నిర్వహించారు. ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షలు ఫిబ్రవరి 10 నుంచి 20 వరకు జరిగాయి. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 10.5 లక్షల మంది విద్యార్ధులు పరీక్షలు రాశారు.