శ్రీశైలం జల దోపిడి...చెన్నై తాగునీటి ముసుగులో ఏపీ కుట్ర

శ్రీశైలం జల దోపిడి...చెన్నై తాగునీటి ముసుగులో ఏపీ కుట్ర

శ్రీశైలం ప్రాజెక్టు నుంచి మరిన్ని నీళ్లు దోచుకునేందుకు ఏపీ లైన్​ క్లియర్​ చేసుకుంటున్నది. ఇప్పటికే పోతిరెడ్డిపాడు హెడ్​రెగ్యులేటర్​ కెపాసిటీని లక్షన్నర క్యూసెక్కులకు పెంచుకున్న పొరుగు రాష్ట్రం.. దాని కింద నిర్మించిన శ్రీశైలం రైట్​ మెయిన్​ కెనాల్ (ఎస్ఆర్ఎంసీ) ద్వారా పూర్తి స్థాయిలో నీటిని తరలించుకుపోయేందుకు వీలుగా వారం నుంచి లైనింగ్​ పనులను స్పీడప్ చేసింది. ఇప్పటివరకు లైనింగ్​ లేని ఈ కెనాల్ ద్వారా కేవలం 44 వేల క్యూసెక్కులనే తరలించే వీలుండగా.. రెండు, మూడు నెలల్లో లైనింగ్​ పూర్తి చేయడం ద్వారా రోజూ 90 వేల క్యూసెక్కుల (8 టీఎంసీలు) చొప్పున తన్నుకుపోయేలా కుట్ర చేస్తున్నది. ట్రిబ్యునల్‌‌‌‌లో కేసు నడుస్తున్నా, ఇరిగేషన్​ అవసరాలకు నీళ్లను ఔట్ సైడ్‌‌‌‌​బేసిన్‌‌‌‌కు తరలించడానికి వీల్లేదని బచావత్​ట్రిబ్యునల్ అవార్డు చెబుతున్నా.. ఏపీ అవేవీ లెక్క చేయకుండా ముందుకెళ్తున్నది. 

నాడు 1,500 క్యూసెక్కులకే అనుమతి.. 

శ్రీశైలం ప్రాజెక్టును కేవలం విద్యుదుత్పత్తి కోసమే వాడాలని 1973లో బచావత్ ​ట్రిబ్యునల్​స్పష్టంగా చెప్పింది. హైడ్రోఎలక్ట్రిక్​ ప్రాజెక్ట్​ కాబట్టి.. నీటిని ఇరిగేషన్​ అవసరాల కోసం ఎట్టి పరిస్థితుల్లోనూ వాడడానికి వీల్లేదని ఆదేశించింది. అది కూడా ఔట్​సైడ్​ బేసిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని ఇరిగేషన్​అవసరాలకు తరలించకూడదని పేర్కొంది. ఒకవేళ తరలించాల్సి వస్తే కేవలం ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సైడ్​ బేసిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కే ప్రాధాన్యం ఇవ్వాలని సూచించింది. ఈ క్రమంలో 1977 అక్టోబర్​ 28న జరిగిన అగ్రిమెంట్​ప్రకారం.. చెన్నై తాగునీటి అవసరాలను దృష్టిలో పెట్టుకుని శ్రీశైలం ప్రాజెక్టు నుంచి ఒక వాటర్​ఇయర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 15 టీఎంసీలకు మించకుండా 1,500 క్యూసెక్కులతో కాల్వలను డిజైన్​ చేయించాలని సూచించింది. కానీ, చెన్నైకి తాగునీటి ముసుగులో ఏపీ పాలకులు ఔట్​సైడ్​ బేసిన్​ అయిన పెన్నా బేసిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని రాయలసీమ ప్రాంతానికి నీటిని తరలించే కుట్రకు తెర లేపారు. 

►ALSO READ | ఏపీ నీటి దోపిడిని అడ్డుకోండి..కృష్ణా బోర్టుకు తెలంగాణ లేఖ

1980లలో మొదలైన ఆ జల దోపిడీ.. ఆ తర్వాత మరింత పెరిగి, ప్రస్తుతం రోజూ 8 టీఎంసీలు తరలించే స్థాయికి చేరింది. ఏపీ పాలకులు 1980లలో 44,600 క్యూసెక్కుల కెపాసిటీతో పోతిరెడ్డిపాడు హెడ్​రెగ్యులేటర్, 19,150 క్యూసెక్కుల సామర్థ్యంతో శ్రీశైలం రైట్​మెయిన్​ కెనాల్​(అన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లైన్డ్), 48,525 క్యూసెక్కుల సామర్థ్యంతో బనకచర్ల క్రాస్​ రెగ్యులేటర్ల నిర్మాణం చేపట్టారు. 2005లో పోతిరెడ్డిపాడు సామర్థ్యాన్ని 1,56,100 క్యూసెక్కులకు, ఎస్ఆర్ఎంసీ సామర్థ్యాన్ని 44 వేల క్యూసెక్కులకు, బనకచర్ల క్రాస్​ రెగ్యులేటర్​ సామర్థ్యాన్ని 81,975 క్యూసెక్కులకు పెంచారు. 2020లో ఎస్ఆర్ఎంసీ కెపాసిటీని 89,762 క్యూసెక్కులకు పెంచేలా లైనింగ్​పనులను చేపట్టేందుకు ఏపీ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. ఆ ఏడాది మే 5న జీవో 203 ఇచ్చింది. ఇప్పుడు ఆ పనులను స్పీడప్​చేస్తోంది.