శ్రీశైలం నీళ్లన్నీ తోడేస్తోంది.. ఏపీని కట్టడి చేయండి

శ్రీశైలం నీళ్లన్నీ తోడేస్తోంది.. ఏపీని కట్టడి చేయండి
  • ఆ రాష్ట్రాన్ని కట్టడి చేయండి
  • ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎల్బీసీకి 45 టీఎంసీలు వాడుకునే అనుమతి ఇవ్వండి
  • నల్గొండ జిల్లాలో 13 లిఫ్టులపై అభ్యంతరాలు లేవు
  • కృష్ణా బోర్డుకు తెలంగాణ లెటర్లు

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, వెలుగు: శ్రీశైలం నుంచి ఏపీ 34 టీఎంసీలకు మించి వాడుకోకుండా కట్టడి చేయాలని కృష్ణా బోర్డును తెలంగాణ కోరింది. పోతిరెడ్డిపాడు హెడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రెగ్యులేటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, బానకచర్ల క్రాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రెగ్యులేటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని అన్ని ఔట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లెట్లపై సెన్సార్లు ఏర్పాటు చేసి నీళ్ల లెక్కలు పక్కగా తీయాలని డిమాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేసింది. ఈ మేరకు ఇరిగేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఈఎన్సీ (జనరల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌) మురళీధర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గురువారం కేఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎంబీకి మూడు వేర్వేరు లెటర్లు రాశారు. శ్రీశైలం లెఫ్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బ్యాంక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కెనాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎల్బీసీ) నుంచి 45 టీఎంసీల నికర జలాలు వాడుకునేందుకు అనుమతి ఇవ్వాలని, నల్గొండలో తాము చేపట్టిన 13 ఎత్తిపోతల పథకాలపై ఎలాంటి అభ్యంతరాలు లేవని ఆయా లేఖల్లో పేర్కొన్నారు.

చెన్నైకి సరఫరా చేస్తున్న తాగునీటిని లెక్కించేందుకు చెన్నముక్కపల్లి ఆఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టేక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, కండలేరుపై గల అన్ని ఔట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లెట్లు, పూండి రిజర్వాయర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై సెన్సార్లు ఏర్పాటు చేసి లెక్కించాలని కోరారు. ఆర్డీఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నుంచి పూర్తి కేటాయింపుల మేరకు నీటిని వాడుకునేలా ఆర్డీఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మోడ్రనైజేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అంశాన్ని చేర్చాలని కోరారు. ఎస్ఎల్బీసీ నుంచి 45 టీఎంసీల నికర జలాలు ఉపయోగించుకునేందుకు అనుమతి ఇవ్వాలని కోరారు. బచావత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ట్రిబ్యునల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (కేడబ్ల్యూడీటీ–1) పోలవరం ప్రాజెక్టుకు అనుమతి వచ్చిన వెంటనే నాగార్జునసాగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ఎగువన 80 టీఎంసీలు వాడుకునేందుకు అనుమతి ఇచ్చిందని గుర్తు చేశారు. ఉమ్మడి ఏపీలోనే పోలవరం నుంచి కృష్ణా డెల్టాకు మళ్లించే నీటిలో తెలంగాణ కోటాకు వచ్చే 45 టీఎంసీల నికర జలాలు ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎల్బీసీకి ప్రతిపాదించారని తెలిపారు.

నల్గొండ జిల్లాలో సాగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎడమ కాలువ ఆయకట్టును స్థిరీకరించేలా తాము 13 లిఫ్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్కీంలు చేపట్టామని, వాటిపై ఎలాంటి అభ్యంతరాలు లేవన్నారు. ఏపీ ప్రభుత్వం రూ.47,776.50 కోట్లతో శ్రీశైలం నుంచి ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఆర్బీసీ, తెలుగుగంగ, హంద్రీనీవా, గాలేరు–నగరి సుజల స్రవంతి సహా అనేక ప్రాజెక్టులను మిగులు జలాలు తీసుకునేందుకు చేపట్టారని, వాటిపై తాము ఇప్పటికే ఫిర్యాదు చేశామని తెలిపారు. కేఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎంబీ, అపెక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కౌన్సిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అనుమతి లేకుండా ఈ ప్రాజెక్టుల విషయంలో ఏపీ ముందుకు వెళ్లకుండా కట్టడి చేయాలని కోరారు.