ట్రిబ్యునల్ అనుమతి లేకున్నా ఏపీ నీటిని తరలిస్తోంది

  • కృష్ణా బోర్డుకు తెలంగాణ ప్రభుత్వం ఫిర్యాదు

హైదరాబాద్: ఏపీ ప్రభుత్వం ట్రిబ్యునల్ అనుమతి లేకుండా అక్రమంగా నీటిని కృష్ణా బేసిన్ బయటకు తరలిస్తోందని  తెలంగాణ శనివారం కృష్ణా నది యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ)కి ఫిర్యాదు చేసింది. బచావత్ ట్రిబ్యునల్ తీర్పు ప్రకారం శ్రీశైలం జల విద్యుత్ కేంద్రం మాత్రమేనని తెలంగాన ఈఎన్ఎసి మురళీధర్ గుర్తు చేశారు. కృష్ణా నది పరివాహక ప్రాంతాలను కాదని 700 వందల కిలోమీటర్ల దూరం నీటిని తరలించడం సరికాదని ఫిర్యాదు చేశారు. ఏపీ ప్రభుత్వ చర్యల వల్ల తెలంగాణలోని కృష్ణ నది పరివాహక ప్రాంతాలు నష్టపోయే పరిస్థితి ఏర్పడుతోందని ఆయన పేర్కొన్నారు.