AP News: మద్యం షాపులకు 3 రోజుల్లో 3 వేల దరఖాస్తులు

AP News: మద్యం షాపులకు 3 రోజుల్లో  3 వేల దరఖాస్తులు

ఆంధ్రప్రదేశ్​ లో మద్యం దుకాణాలు నిర్వహించేందుకు లైసెన్స్​ ప్రక్రియ మొదలైంది. అక్టోబర్​ 9 వరకు దరఖాస్తు చేసుకొనేందుకు అవకాశం ఉండగా మూడు రోజుల్లో 3 వేల దరఖాస్తులు వచ్చాయి.  మొదటి రోజు 200  రాగా రెండు రోజుల్లో 2 వేల 800 కు పైగా దరఖాస్తులు వచ్చాయి.  మద్యం లైసెన్స్​ లవి షయంలో ప్రభుత్వానికి రూ. 60 కోట్లు ఆదాయం వచ్చింది. 

ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా మొత్తం 3,796 వైన్ షాపులు.. 12 స్మార్ట్​ స్టోర్స్​  ఏర్పాటు చేయనున్నారు. వీటిలో 10 శాతం అంటే రాష్ట్ర వ్యాప్తంగా 340 దుకాణాలను గీత కార్మికులకు కేటాయించనున్నట్లు ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించింది.  లాటరీ పద్దతిలో మద్యం దుకాణాలను కేటాయించనుండటంతో ఎక్కువ మంది పాల్పడకుండా సిండికేట్ అయి తక్కువ మంది ఒక్కొక్క మద్యం దుకాణానికి లైసెన్స్ ఫీజు చెల్లిస్తున్నట్లు, వారు కూడా బినామీలతో చేయిస్తున్నట్లు కూడా అనుమానాలున్నాయి.. దీంతో మద్యం నుంచి ప్రభుత్వం ఆశించినంత లిక్కర్ లైసెన్స్ ఫీజుల రూపంలో వచ్చే అవకాశం లేదు. ప్రభుత్వం దాదాపు రెండు వేల కోట్ల రూపాయల ఆదాయం వస్తుందని అంచనా వేసింది.