AP News: ఏపీలో లిక్కర్ కిక్కు.. సందడి సందడిగా.. షాపుల వేలం

AP News: ఏపీలో లిక్కర్ కిక్కు.. సందడి సందడిగా.. షాపుల వేలం

ఆంధ్రప్రదేశ్​ మద్యం షాపుల కోసం కోలాహలం మొదలైంది.  దరఖాస్తు దాఖలు చేసిన వారు అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. రాష్ట్రంలో మద్యం దుకాణాల లాటరీ ప్రక్రియ  ఈ రోజు( అక్టోబర్​ 14)  ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది.  లాటరీ ప్రక్రియ కేంద్రం వద్ద ఆశావాహుల్లో  టెన్షన్ వాతావరణం నెలకొంది.  తమపేరు  వస్తుందని ఆశావహులు  ఎదురుచూపులు చూస్తున్నారు. 

సోమవారం( అక్టోబర్​ 14) ఉదయం నుంచే మద్యం దుకాణాల వేలం ప్రక్రియతో ఆయా ప్రాంతాలు సండడిగా మారాయి. ఎటువంటి ఉద్రిక్తతలు తలెత్తకుండా లాటరీ కేంద్రాల వద్ద పోలీసులు ఆంక్షలు విధించారు.100 మీటర్ల పరిధిలోనే వాహనాల రాకపోకలను నిలిపేస్తున్నారు.  కాలినడకతోనే మద్యం లాటరీ కేంద్రాలకు అనుమతిస్తున్నారు.. జిల్లా గెజిట్‌లో ప్రచురించిన దుకాణాల క్రమసంఖ్య ప్రకారం లాటరీ ప్రకియ జరుగుతుంది. 


రాష్ట్రవ్యాప్తంగా  3 వేల 396 మద్యం షాపులకు గాను మొత్తం 89 వేల 882  దరఖాస్తులు వచ్చాయి.  డ్రాలో దుకాణం దక్కించుకున్న వ్యాపారులు 24 గంటల్లో లైసెన్స్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.   దీని ద్వారా  రూ 300 కోట్లు ప్రభుత్వానికి ఆదాయంగా రానున్నాయి.  26 జిల్లాల పరిధిలో కలెక్టర్లు.. ఎక్సైజ్​ అధికారుల  పర్యవేక్షణలో ఈ ప్రక్రియ జరుగుతుంది. లాటరీ ప్రకియ అంతా  దరఖాస్తుదారుల సమక్షంలోనే జరుగుతుంది. ప్రతి దుకాణానికి వేర్వేరుగా లాటరీ తీసి, ఎంపికైన వారికి లైసెన్స్‌ పత్రాలు అందజేస్తారు.  మద్యం దరఖాస్తుల ద్వారా ప్రభుత్వానికి నాన్​ రిఫండబుల్​ ఆదాయం రూ, 1,794.64 కోట్లు లభించింది.  అయితే మద్యం నూతన పాలసీ ప్రారంభంలోనే రూ. 2400 కోట్ల ఆదాయం సమకూరుతుంది. గీత కులాలకు మద్యం షాపుల్లో 10 శాతం రిజర్వేషన్ అమలు చేసింది కూటమి ప్రభుత్వం. గీత కులాలకు కేటాయించిన షాపులలో లైసెన్స్ ఫీజు 50 శాతం రాయితీ కల్పించారు.

ఎన్టీఆర్‌ జిల్లాలో అత్యధికంగా 113 షాపులకు 5 వేల 825 అప్లికేషన్స్‌ వచ్చాయి  సగటున  ఒక్కో షాపునకు సగటున 52 మంది పోటీలో ఉన్నారు. ఒక షాప్‌ కోసం 132 దరఖాస్తులు రాగా ... మరో షాప్‌ కోసం 120దరఖాస్తులు అందాయి. చిత్తూరు జిల్లాలో  227 షాపులకు 3920 దరఖాస్తులు దాఖలు వచ్చాయి. తరువాత స్థానంలో తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, గుంటూరు జిల్లాల్లో కూడా పోటీ తీవ్రంగా ఉంది.  అనంతపురం జిల్లాలో 12 షాపులకు అతి తక్కువ దరఖాస్తులు వచ్చాయి. అల్లూరి సీతారామరాజు జిల్లాలో 40, అత్యధికంగా తిరుపతి జిల్లాలో 227 దుకాణాల్ని నోటిఫై చేశారు. తిరుపతి, శ్రీసత్యసాయి, బాపట్ల, అన్నమయ్య, ప్రకాశం, పల్నాడు వంటి జిల్లాల్లో దరఖాస్తులు తక్కువగా వచ్చాయి. తాడిపత్రి, కమలాపురం వంటి నియోజకవర్గాల్లో ఒక్కో దుకాణానికి రెండు, మూడేసి దరఖాస్తులే వచ్చాయి.