గుడ్ న్యూస్: ఏపీలో మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల..

గుడ్ న్యూస్: ఏపీలో మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల..

నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది కూటమి సర్కార్. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది ప్రభుత్వం. https://cse.ap.gov.in, https://apdsc.apcfss.in అనే అదికారిక వెబ్‌సైట్ల ద్వారా అభ్యర్థులు తమ దరఖాస్తులను దాఖలు చేసుకోవాల్సి ఉంటుందని తెలిపింది ప్రభుత్వం. ఈమేరకు ఎక్స్ వేదికగా వివరాలు వెల్లడించారు మంత్రి నారా లోకేష్. ఏప్రిల్‌ 20 నుంచి మే 15 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనునుండగా... జూన్‌ 6 నుంచి జులై 6 వరకు సీబీటీ విధానంలో పరీక్షలు నిర్వహించనుంది ప్రభుత్వం.

16 వేల347 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి గాను నోటిఫికేషన్ విడుదల చేసింది ప్రభుత్వం. మెగా డీఎస్సీకి సంబంధించిన పూర్తి సమాచారం, సంబధిత జీవోలు, పోస్టుల వివరాలు, పరీక్షా షెడ్యూలు, సిలబస్, హెల్ప్​లైన్ సెంటర్ల వివరాలు పాఠశాల విద్యాశాఖ అధికారిక వెబ్‌సైట్లో పొందవచ్చు. https://cse.ap.gov.in , https://apdsc.apcfss.in వెబ్​సైట్లలో పూర్తి వివరాలు అందుబాటులో ఉంటాయి. 

►ALSO READ | జేఈఈ మెయిన్స్లో మనోళ్ల హవా.. రాష్ట్రానికి చెందిన ముగ్గురు స్టూడెంట్లకు 100 పర్సంటైల్

ఇలా అప్లై చేసుకోవాలి:

అభ్యర్థులంతా ఆన్లైన్లో అప్లై చేసుకోవాలని తెలిపింది ప్రభుత్వం. అప్లై చేసుకునే సమయంలో అభ్యర్థులకు ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా ఒక డెమో వీడియోను ఎక్స్ వేదికగా షేర్ చేశారు మంత్రి నారా లోకేష్.