భోగి వేడుకల్లో స్టెప్పులేసిన మంత్రి అంబటి

తెలుగురాష్ట్రాల్లో భోగి  వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. పల్లెలు పట్నాలు అనే తేడా లేకుండా ప్రజలు భోగి మంటలు వెలిగిస్తున్నారు.  ఏపీ మంత్రి అంబటి రాంబాబు  సత్తెనపల్లిలో జరిగిన  భోగి వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. గిరిజనులతో కలిసి స్టెప్పులేశారు. ఉత్సాహంగా ఆడిపాడారు. అక్కడున్న వారు మంత్రి స్టెప్పులకు ఈలలు వేస్తూ చప్పట్లు కొడుతూ ఎంజాయ్ చేశారు. అంబటి  వేసిన  స్టెప్పులు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

వేడుకల అనంతరం మాట్లాడిన అంబటి రాంబాబు.. భోగి సంబరాల్లో పాల్గొనటం సంతోషంగా ఉందన్నారు.  సీఎం జగన్ పాలనలో ప్రజలు సంతోషంగా ఉన్నారని చెప్పారు. గత కొన్ని రోజులుగా మంత్రి అంబటి రాంబాబు పవన్ కళ్యాణ్ కు  కౌంటర్ వేస్తున్నారు. జనసేన  కూడా అంబటిని టార్గెట్ చేస్తూ విమర్శలు చేస్తోంది.