త్వరలోనే అందరినీ కలుస్తా: ఉప ముఖ్యమంత్రి పవన్​ కళ్యాణ్​

జనసేన అధినేత, రాష్ట్రమంత్రి పవన్​ కళ్యాణ్​ త్వరలోనే జిల్లాల వారీగా  అందరినీ కలుస్తానని తెలిపారు.  తనకు రాష్ట్రం నలుమూలల నుంచి కార్యకర్తలు, ప్రజలు, మేధావులు, నిపుణులు, సినీ రంగం వారు, వీర మహిళలు, ఉద్యోగులు, ఇలా అందరూ అభినందలు తెలుపుతున్నారని తెలిపారు.  చాలా చోట్ల వీర మహిళలు, జనసైనికులు ఆనందంతో వేడుకలు చేసుకున్నారన్నారు.ఎన్నికల్లో కష్టపడిన  ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు పవన్ కల్యాణ్.. 

ప్రస్తుతం రాష్ట్ర మంత్రిగా బాధ్యతలు స్వీకరించాల్సి ఉంది. అదే విధంగా శాసనసభ సమావేశాలు కూడా త్వరలోనే ఉంటాయి. వీటిని పూర్తి చేసుకుని నన్ను అఖండ మెజారిటీతో గెలిపించిన పిఠాపురం నియోజకవర్గ ప్రజలను కలుస్తాను.. ఈ నెల 20వ తేదీ తర్వాత పిఠాపురం నియోజకవర్గంలో పర్యటిస్తానని, నియోజకవర్గ ప్రజలను, కార్యకర్తలను కలుస్తానని పవన్ కల్యాణ్ వెల్లడించారు ఆ తర్వాత దశలవారీగా అన్ని గ్రామాల్లో పర్యటిస్తాను అని పవన్ కల్యాణ్ వెల్లడించారు. ఎన్నికల్లో జనసేన 21కి 21 స్థానాలు గెలుచుకుంది.

రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం అనంతరం నన్ను నేరుగా కలిసి అభినందించాలని పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆశిస్తున్నారని.. త్వరలోనే వారందరినీ జిల్లాల వారీగా కలిసి మాట్లాడాలని నిర్ణయించుకున్నట్లు పవన్ తెలిపారు. ఇందుకు సంబంధించిన షెడ్యూల్ కేంద్ర కార్యాలయం ద్వారా తెలియ చేస్తామన్నారు. కాగా, తనకు అభినందనలు తెలియ చేయడానికి వచ్చే వారు పూల బొకేలు, శాలువాలు తీసుకురావద్దని విజ్ఞప్తి చేశారు పవన్.