నాలుగు రోజుల్లో ఏపీలో కులగణన పూర్తి కాబోతుంది అన్నారు బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ.. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో పర్యటించిన మంత్రి .. చంద్రబాబు అవాస్తవాలు ప్రచారం చేస్తున్నాడంటూ ఫైర్ అయ్యారు.. తూర్పు గోదావరి జిల్లా నుంచి 8 మంది శెట్టిబలిజలను సీఎం వైఎస్ జగన్ చట్టసభలకు పంపించారని తెలిపారు.. బీసీల రాజ్యాధికారం కోసం శెట్టిబలిజలు పెద్దన్న పాత్ర పోషిస్తున్నారని తెలిపారు. మరోవైపు.. 40 ఏళ్ల టీడీపీకి రాజ్యసభలో చోటు లేకుండా పోతుంది అని జోస్యం చెప్పారు.
సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డి పరిపాలన బీసీలకు సువర్ణ అధ్యాయంగా అభివర్ణించారు.. శెట్టిబలిజలపై చిన్న చూపు అంటూ శెట్టిబలిజలకు 2 సీట్లు ఇస్తే గెలుస్తారా..? అంటూ అవహేళన చేసిన వ్యక్తి చంద్రబాబు అని దుయ్యబట్టారు.. . సీఎం వైఎస్ జగన్ ఒక ఆశయంతో ఎన్నికలకు వెళ్తున్నారు.. టీడీపీ- జనసేనలు ఆశతో పొత్తుల పెట్టుకుంటున్నాయని ఎద్దేవా చేశారు ఏపీ బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ..