ఆంధ్రపదేశ్ ఐటీ మంత్రి నారా లోకేష్ అమెరికాలో పర్యటిస్తున్నారు. లాస్ వేగాస్ లో నిర్వహించిన ఐటి సర్వ్ సినర్జీ సమ్మిట్ లో మంత్రి లోకేష్ మాట్లాడుతూ ఓర్పుగా ఉండటం, ఎలాంటి పరిస్థితిని అయినా ఒకేలా తీసుకుని ఎదుర్కోవడం లాంటివి, చంద్రబాబు గారిని చూసి నేర్చుకున్నాన ని మంత్రి నారా లోకేష్ అన్నారు. అన్న ఎన్టీఆర్ తో అనేక అనుభూతులు ఉన్నాయని.. మా అందరికీ పేర్లు పెట్టింది తాత గారేనని ... అభివృద్ధి వికేంద్రీకరణ మా ప్రభుత్వ విధానమని చెప్పిన మంత్రి లోకేష్.... . ఇందులో భాగంగానే అనంతపురంలో ఆటోమొబైల్ హబ్ గా, చిత్తూరుని ఎలక్ట్రానిక్స్ హబ్ గా, గుంటూరు, కృష్ణా పరిపాలనా రాజధానిగా తీర్చిదిద్దేలా ప్రణాళికలు చేసి అమలు చేశామన్నారు.
విశాఖని ఐటి రాజధానిగా మార్చాలని కృత నిశ్చయంతో మా ప్రభుత్వం పని చేస్తుందన్నారు. విశాఖ ఒక అద్భుతమైన ప్రదేమంటై.. అక్క మంచి ఎకో సిస్టం ఉందన్నారు. ఛాలెంజ్స్ తీసుకోవటం అంటే నాకు చాలా ఇష్టమని.. . ఎక్కడైతే ఓడిపోయానో, అక్కడే పని చేసి, ప్రజల మనసు గెలుచుకుని రికార్డు మెజారిటీతో గెలిచానన్నారు. . నేను తీసుకున్న మంత్రిత్వ శాఖ కూడా చాలా ఛాలెంజ్స్ తో కూడుకున్నదనీ.... ఏ రాజకీయ నాయకుడు అయినా, ఇలా ఛాలెంజ్స్ తీసుకుని, ప్రజలకు మరింత సేవ చేయాలని మంత్రి లోకేష్ అన్నారు.
ALSO READ : డిప్యూటీ సీఎం పవన్ ను కలిసిన హోంమంత్రి అనిత.. కీలక అంశాలపై చర్చ..
ప్రజా సేవ చేయాలంటే మంచి మనసు ఉండాలి.తెలుగుదేశం పార్టీ రాజకీయ విశ్వవిద్యాలయంగా ఎంతో మంది నాయకులను తయారు చేసిందని... .ప్రజా సేవ చేయడానికి,ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడానికి ప్రజలు తెలుగుదేశం ప్రభుత్వానికి గొప్ప అవకాశం ఇచ్చారని తెలిపారు. సీఎం చంద్రబాబుకు ఒక ప్రత్యేక విజన్ ఉంది.... ఇన్వెస్టర్స్ ఫ్రెండ్లీ విధానాలు అమలు చేస్తూ,ఉపాధి కల్పన దిశగా ముందుకు వెళుతున్నామని లోకేష్ అన్నారు.