రెడ్ బుక్ పై మరోసారి వ్యాఖ్యలు చేశారు ఏపీ మంత్రి నారా లోకేష్. ఏపీలో నారా లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందంటూ వైసీపీ నేతలు విమర్శలు చేసిన సంగతి తెలిసిందే.. ఈ క్రమంలో ఇవాళ మరోసారి రెడ్ బుక్ పై క్లారిటీ ఇచ్చారు లోకేష్. రెడ్ బుక్ లో ఉన్న ఏ ఒక్కరిని వదలబోనన్నారు. చట్టాన్ని ఉల్లంఘించిన వారిని రెడ్ బుక్కులో చేర్చామని చెప్పారు.
రెడ్ బుక్ అంటే, చట్టాన్ని ఉల్లంఘించిన వారిని చట్ట ప్రకారం శిక్షించేదన్నారు లోకేష్. తా ను ప్రతి మీటింగ్ లో, ప్రజలకు రెడ్ బుక్ గురించి చెప్పానన్నారు. ప్రజలు కూడా చట్టాన్ని ఉల్లంఘించిన వారికి శిక్ష పడాలని తీర్పు ఇచ్చారని చెప్పారు. జోగి రమేష్ కొడుకు భూమి కబ్జా చేసాడు, వదిలేయాలా?.. రేపు లిక్కర్ స్కాం మీద, ఇసుక దందాల్లోనూ తాము చర్యలు తీసుకుంటామన్నారు. ప్రతి స్కాం మీద చట్టప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు నారా లోకేష్.