మహా కుంభమేళాలో నారా లోకేష్ కుటుంబం

మహా కుంభమేళాలో నారా లోకేష్ కుటుంబం

ఎప్పుడూ రాజకీయాలు, ప్రజా సమస్యలతో బిజీ బిజీ జీవితాన్ని గడిపే ఏపీ మంత్రి నారా లోకేష్ మహా కుంభమేళాలో కనిపించారు. భార్య బ్రాహ్మణి, కుమారుడు దేవాన్ష్‌తో కలిసి మహా కుంభమేళాకు విచ్చేసిన లోకేష్.. త్రివేణి సంగమం వద్ద పుణ్య స్నానాలు ఆచరించారు. అనంతరం దంపతులిద్దరూ గంగాదేవికి పూజలు చేసి, హారతులిచ్చారు. పితృదేవతలను స్మరించుకుంటూ బ్రాహ్మణులకు వస్త్రదానం చేశారు. అందుకు సంబంధించిన ఫోటోలను బ్రాహ్మణి సోషల్ మీడియాలో పంచుకుంది.

ఇదిలావుంటే, 144 ఏళ్లకు ఒక్కసారి వచ్చే మహా కుంభమేళాకు భక్తులు భారీ సంఖ్యలో తరలివస్తున్నారు. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ లెక్కల ప్రకారం, ఆదివారం(ఫిబ్రవరి 16) సాయంత్రం 6 గంటల నాటికి సుమారు 52.83 కోట్ల మంది భక్తులు పవిత్ర స్నానాలు ఆచరించారు.