
ప్రముఖ హీరోయిన్ రోజా సెల్వమణి(Roja) సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. కేవలం నటిగానే కాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయల్లో డైనమిక్ నాయకురాలుగా వరుస విజయాలతో దూసుకెళ్తోంది. ఆమె తెలుగుతో పాటు కన్నడ, తమిళం, మలయాళం భాషల్లో 100కు పైగా సినిమాల్లో నటించిన విషయం తెలిసిందే.
తాజాగా ఒకప్పటి హీరోయిన్,మంత్రి రోజాకు సంబంధించి జీవిత చరిత్ర బుక్‌ను శుక్రవారం (మార్చి 22న) రిలీజ్ చేశారు.‘రంగుల ప్రపంచం నుంచి రాజకీయాల్లోకి’ అనే పేరుతో రోజా జీవిత చరిత్ర రచించడం జరిగింది. ఈ బుక్‌ను అంబటి రాంబాబు, భూమన కరుణాకర్ రెడ్డి చేతుల మీదుగా విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో రోజా భర్త, తమిళ డైరెక్టర్ సెల్వమణితో పాటు సింగర్ మనో పాల్గొన్నారు.
ప్రస్తుత రోజా రాజకీయాల విషయానికి వస్తే..ఆమె నగరి నియోజకవర్గం నుండి పోటీ చేసి రెండుసార్లు శాసనసభ్యురాలిగా ఎన్నికైంది.ఇక 2022 లో జరిగిన మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణలో భాగంగా ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి మంత్రివర్గంలో టూరిజం, సాంస్కృతిక, యువజన శాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసింది.
వైసీపీలో ఫైర్ బ్రాండ్ నేతగా పేరు తెచ్చుకున్న రోజాకు మూడోసారి కూడా నగరి నుంచి ఎమ్మెల్యే టికెట్ కేటాయించడం..అసెంబ్లీ ఎన్నికల వేళ రోజా జీవిత చరిత్రపై బుక్ విడుదల కావడం ప్రాధాన్యత సంతరించుకుంది.
Minister Roja's biography Book Released on Market
— Milagro Movies (@MilagroMovies) March 22, 2024
Titled as "Colorful World to Politics"#Roja pic.twitter.com/YIeGXH1rTP