ప్రజల ప్రాణాలతో టీడీపీ అధినేత చంద్రబాబు చెలగాటం ఆడుతున్నారని ఏపీ మంత్రి ఆర్కే రోజా ఆరోపించారు. లోకేష్ పాదయాత్ర ఆయన డైటింగ్లో భాగమేనని విమర్శించారు. డ్రోన్ కెమెరాల షాట్ల కోసం సందుల్లో సభలు పెట్టి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతూ.. నీతిమాలిన రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. కందుకూరు, గుంటూరు ఘటనలపై పవన్ కల్యాణ్ ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. అయినా దీనిపై ఏ పార్టీ, ఏ మీడియా డిబేట్లలో విమర్శలు చేయకపోవడం ఆశ్చర్యంగా ఉందన్నారు.
మనవడితో ఆడుకోవాల్సిన వయసులో చంద్రబాబుకు ఈ పబ్లిసిటీ పిచ్చి ఏంటో తనకు అర్థం కావడం లేదన్నారు. పవన్ కల్యాణ్ ప్యాకేజీలకు తప్ప.. పాలిటిక్స్ కు పనికి రాడని ఎద్దేవా చేశారు.మంగళగిరిలో ఎమ్మెల్యేగా గెలవలేని లోకేష్.. 151 సీట్లు గెలిచిన సీఎం జగన్ తో పోటీపడాలని చూడటం హాస్యాస్పదమని రోజా విమర్శించారు. లోకేష్ ను ఎమ్మెల్సీగా చేసిన మొట్టమొదటి రోజే వాళ్ల నాన్నకు ఓటుకునోటు కేసులో నోటీసులు వచ్చాయని.. లోకేష్ ఎంట్రీతో ఇంకా ఏం జరుగుతుందోనని టీడీపీ క్యాడర్ అంతా భయపడుతోందన్నారు. లోకేష్ పాదయాత్రతో టీడీపీకి ఒరిగిందేం లేదన్నారు.