కంటతడి పెట్టిన మంత్రి విడదల రజనీ

కంటతడి పెట్టిన మంత్రి విడదల రజనీ

ఏపీ మంత్రి విడదల రజనీ కంటతడి పెట్టారు. సీఎం  జగన్మోహన్ రెడ్డి సమక్షంలో భావోద్వేగానికి గురయ్యారు. ఆంధ్రప్రదేశ్ పల్నాడు జిల్లాలోని చిలకలూరిపేట మండలం లింగంగుంట్లలో సీఎం జగన్ ఫ్యామిలీ డాక్టర్ వైద్య విధానాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వేదికపై  మంత్రి విడదల రజనీ ప్రసంగిస్తూ..ఏమోషనల్ అయ్యారు. 

ఏమన్నారంటే...  

ముఖ్యమంత్రి జగన్ గురించి చెబుతూ మంత్రి విడదల రజనీ కన్నీటిని అదుపు చేసుకోలేకపోయారు. తన రాజకీయ జీవితం...ఎమ్మెల్యే పదవి....మంత్రి పదవి అన్నీ జగనన్న పెట్టిన భిక్ష అన్నారు. ఆయన  రుణం ఎప్పటికీ తీర్చుకోలేనంటూ ఎమోషనల్ అయ్యారు.  ఒక సాధారణ బీసీ మహిళ అయిన తనకు చిలకలూరిపేట నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశాన్ని కల్పించారని చెప్పారు. మంత్రిగా అవకాశం ఇచ్చారని అన్నారు. జగనన్నకు జీవితాంతం రుణపడి ఉంటానని చెప్పారు. 

జగనన్న ఆశయాల సాధనే లక్ష్యంగా పని చేస్తానని మంత్రి విడదల రజనీ చెప్పుకొచ్చారు. ఆయన ఆలోచన అమలే ధ్యేయంగా....ఆదర్శాలే ఆచరణగా, జగనన్న నాయకత్వమే అదృష్టంగా...ఆయన అప్పగించిన ప్రతీ కర్తవ్యాన్ని నిజాయితీగా నిర్వర్తిస్తూనే ఉంటానని భావోద్వేగంతో  అన్నారు. ముఖ్యమంత్రి జగన్ సభలో మంత్రి రజనీ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయంగా చర్చకు కారణమయ్యాయి.