ఏపీలో టీడీపీ ప్రభుత్వం ఏర్పడిన తరువాత జూన్ 12 న చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు. అదే రోజు ఆయనతో పాటు 24 మంది మంత్రులుగా ప్రమాణం చేశారు. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కు ఉపముఖ్యమంత్రి పదవితో పాటు ఐదు కీలక శాఖలను చంద్రబాబు అప్పగించారు. లోకేష్‌కు గతంలో నిర్వహించిన ఐటీ శాఖతో పాటు , రియల్ టైమ్ గవర్నెన్స్(ఆర్టీజీ),మానవ వనరుల శాఖలు కేటాయించారు. మిగతా మంత్రులకు కేటాయించిన వివరాలు చూద్దాం. . . .
- నారా చంద్రబాబునాయుడు (ముఖ్యమంత్రి) : - సాధారణ పరిపాలన శాఖ, శాంతిభద్రతలు, మంత్రులకు కేటాయించని ఇతర శాఖలు
- పవన్‌కల్యాణ్(ఉపముఖ్యమంత్రి) : పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, తాగునీటి సరఫరా,పర్యావరణం, అడవులు, సైన్స్ అండ్ టెక్నాలజీ
- నారా లోకేష్ : ఐటీ, రియల్ టైమ్ గవర్నెన్స్(ఆర్టీజీ),మానవ వనరులు
- వంగలపూడి అనిత: హోంశాఖ, విపత్తు నిర్వహణ
- అచ్చెన్నాయుడు : వ్యవసాయ, ఫిషరీస్, అనుబంధ శాఖలు
- కొల్లు రవీంద్ర: గనులు, జియాలజీ, ఎక్సైజ్
- నాదెండ్ల మనోహర్ : పౌరసరఫరాలశాఖ,వినియోగదారుల వ్యవహారాలు
- పొంగూరు నారాయణ : మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి
- సత్యకుమార్ యాదవ్: ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం, వైద్య విద్య
- నిమ్మల రామానాయుడు: జలవనరుల అభివృద్ధి
- ఎన్‌ఎండీ ఫరూక్: న్యాయశాఖ, మైనారిటీ సంక్షేమం
- ఆనం రామనారాయణరెడ్డి: - దేవదాయ
- పయ్యావుల కేశవ్ :ఆర్ధిక శాఖ, శాసనసభ వ్యవహారాలు,వాణిజ్య పన్నులు
- అనగాని సత్యప్రసాద్: రెవెన్యూ, స్టాంపులు, రిజిస్ట్రేషన్లు
- కొలుసు పార్థసారధి : గృహనిర్మాణం, సమాచార శాఖ
- డోలా వీరాంజనేయస్వామి: సాంఘిక సంక్షేమం, సచివాలయం, గ్రామ వాలంటీర్ల వ్యవహారాలు
- గొట్టిపాటి రవికుమార్ :విద్యుత్ శాఖ
- కందుల దుర్గేష్ : పర్యాటక, సాంస్క్రతిక, సినిమాటోగ్రఫీ
- గుమ్మడి సంధ్యారాణి: మహిళా శిశు సంక్షేమం, గిరిజన సంక్షేమం
- బీసీ జనార్దన్‌రెడ్డి : రోడ్లు, భవనాలు, మౌలిక వసతులు, పెట్టుబడులు
- టీజీ భరత్ : పరిశ్రమలు, వాణిజ్యం, ఆహార శుద్ధి
- ఎస్.సవిత : బీసీ సంక్షేమం, ఆర్థికంగా వెనుకబడిన వర్గాల సంక్షేమం, చేనేత
- వాసంశెట్టి సుభాష్ కార్మిక, ఫ్యాక్టరీలు, బీమా, వైద్య సేవలు
- కొండపల్లి శ్రీనివాస్: ఎంఎస్‌ఎంఈ, సెర్ప్, ఎన్‌ఆర్‌ఐ వ్యవహారాలు
- మండిపల్లి రామ్‌ప్రసాద్‌రెడ్డి: రవాణా, యువజన, క్రీడలు