![చంద్రబాబుకు ఆరో ర్యాంక్ .. మంత్రుల పనితీరు ఆధారంగా ర్యాంక్స్ ఇచ్చిన ఏపీ సీఎం](https://static.v6velugu.com/uploads/2025/02/chandrababu-pawan-and-lokesh-positions-revealed_dU1X7Qoeh9.jpg)
- పవన్ కల్యాణ్ కు 10.. లోకేశ్‌కు ఎనిమిది
- ఫైల్స్ త్వరగా క్లియర్ చేయాలని ఆదేశం
హైదరాబాద్, వెలుగు: మంత్రుల పనితీరు ఆధారంగా వారికి ఏపీ సీఎం చంద్రబాబు ర్యాంకులు ఇచ్చారు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి డిసెంబర్ నెలఖారు వరకు మంత్రుల వద్దకు వచ్చిన ఫైళ్లను క్లియర్ చేయడం ఆధారంగా చేసుకొని వీటిని కేటాయించారు. గురువారం అమరావతి సెక్రటేరియెట్ లో క్యాబినెట్ మీటింగ్ లో వివరాలను వెల్లడించారు. సీఎం చంద్రబాబు కు ఆరో ర్యాంక్ రాగా, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కు 10, నారా లోకేశ్ కు 8వ ర్యాంక్ కేటాయించారు.
మొదటి స్థానంలో ఎన్ఎండీ ఫరూఖ్ నిలిచారు. చివరి స్థానంలో వాసంశెట్టి సుభాశ్ ఉన్నారు. హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత 20వ స్థానంలో నిలిచారు. ఫైళ్లను త్వరగా క్లియర్ చేయాలని మంత్రులను సీఎం చంద్రబాబు ఈ సందర్భంగా ఆదేశించారు.