మహబూబ్ నగర్ రూరర్/పాలమూరు, వెలుగు: పాలమూరు అభివృద్ధి కేవలం బీజేపీతోనే సాధ్యమని ఆ పార్టీ మహబూబ్నగర్ అభ్యర్థి ఏపీ మిథున్ రెడ్డి అన్నారు. మంగళవారం రూరల్ మండలంలోని మంచన్ పల్లి, రామచంద్రపురం, సుగుర్ తండా గ్రామాల్లో పార్టీ నాయకులతో కలిసి ప్రచారాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ తనను ఆశీర్వదించి గెలిపించాలని కోరారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ ఒకటేనని అన్నారు. డబుల్ ఇంజిన్ సర్కారుతోనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని అన్నారు. ఈ సందర్భంగా ఆయ గ్రామాలకు చెందిన యువకులు, బీఆర్ఎస్, కాంగ్రెస్ కార్యకర్తలు భారీ సంఖ్యలో బీజేపీలో చేరారు.కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.