పారిశుధ్య కార్మికుల పనితనాన్ని మెచ్చుకుంటూ ఎమ్మెల్యే వాళ్ల కాళ్లు కడిగిన ఘటన ఆంధ్రప్రదేశ్ లో జరిగింది. ఏపీలోని శ్రీకాళహస్తికి చెందిన ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి ఆదివారం స్థానిక మున్సిపల్ ఆఫీసులో శానిటేషన్ మెషిన్లను ప్రారంభించారు. ఆ తర్వాత పారిశుధ్య కార్మికులు కరోనా నియంత్రణ కోసం చేస్తున్న పనిని అభినందిస్తూ.. వాళ్ల కాళ్లు కడిగారు. ఆ తర్వాత ఆయన బ్లీచింగ్ పౌడర్ ను ఆటోమెటిక్ గా చల్లే ట్రాక్టర్ ను స్వయంగా నడుపుకుంటూ చుట్టు పక్కల పరిసరాల్లో మందు చల్లారు. ఒక ఎమ్మెల్యే అయి ఉండి పారిశుధ్య కార్మికుల కాళ్లు కడగడం.. నిజంగా ఆయన గొప్పతనాన్ని చాటిచెప్తుందని కార్మికులు అంటున్నారు.
For More News..