తెలంగాణ రాష్ట్రంలో భారీ వర్షాల కారణంగా ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మహబూబాబాద్ లో చిక్కుకుపోయారు. నెల్లూరు నుంచి సికింద్రాబాద్ కు మచిలీపట్నం ఎక్స్ప్రెస్ లో ఎమ్మెల్యే చంద్రమోహన్ రెడ్డి ప్రయాణిస్తున్నారు. భారీ వర్షాల వల్ల కేసముద్రం, నెక్కొండ మధ్యలో రైల్వే ట్రాక్ దెబ్బతింది.
వరద నీటి ఉదృతికి రైల్వే ట్రాక్ కొట్టుకుపోయింది. దీంతో ఆ మార్గంలో ప్రయాణించే రైళ్లు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. మహబూబాద్ రైల్వే స్టేషన్లో మచిలీపట్నం ఎక్స్ ప్రెస్ నిలిపివేయడంతో ఎమ్మెల్యే చంద్రమోహన్ రెడ్డి అక్కడే చిక్కుకుపోయారు.
Also Read:-కోదాడలో కొట్టుకొచ్చిన కారులో మృతదేహం
వెంటనే ఆయన మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుకు సమాచారం ఇచ్చారు. మహబూబాబాద్ లో స్థానికంగా ఓ నేత ఇంట్లో ఎమ్మెల్యే సోమిరెడ్డికి బస ఏర్పాటు చేశారు. అక్కడి నుంచి మహబూబాబాద్ లో రోడ్డు మార్గంలో ఆయన హైదరాబాద్ కు చేరుకుంటారు.