
ఓ మోస్ట్ వాంటెడ్ లేడీని పట్టిస్తే రూ. 10 వేల నగదు బహుమతి ఇస్తారంట. పోలీసులకే చుక్కలు చూపిస్తున్న ఆ లేడీ ఎవరో తెలుసుకోవాలని ఉందా.
జంతర్ మంతర్ కిలాడీ లేడి పేరు జగదాంబ..అలియాస్ బుజ్జి. ఉండేది తూర్పుగోదావరి. పేరు బుజ్జి..చూపులకు అమాయకురాలు. కానీ టక్కులమారి. ఎవరినైనా ఇట్టే మోసం చేయగలదు. అందుకోసం వారితో నైస్ గా మాటలు కలిపేస్తుంది. ఎంతో మంచి మినిషి, నిజాయితీగల వ్యక్తిగా కలరింగ్ ఇస్తుంది. పక్కనే కూర్చుని యోగక్షేమాలు అడుగుతుంది. మాటల్లో పెడుతుంది..తన యాక్షన్ చూపిస్తుంది.
ఏం చేస్తుందంటే..
జగదాంబ మామూలు వ్యక్తి కాదు. తెలియని వ్యక్తులతో మంచిగా మాట్లాడి వారికి మర్యాద చేస్తుంది. సరైన టైం చూసి చాకచక్యంగా నిద్ర మాత్రలు కలిపిన కూల్ డ్రింక్‌ను ఒంటరిగా ఉన్న మహిళలకు ఇస్తుంది. వారు స్పృహ కోల్పోయగా..అసలు పని కానిచ్చేస్తుంది. ఇంట్లో..ఒంటిపై ఉన్న నగలు, నగదును దోచుకుని పరారవుతుంది.
మోస్ట్ వాంటెడ్..
జగదాంబపై ఇలా ఒకటి కాదు.. రెండు కాదు..అనేక కేసులున్నాయి. పోలీసులకే చుక్కలు చూపిస్తూ చిక్కకుండా తిరుగుతోంది. దీంతో ఈ మహిళను పోలీసులు మోస్ట్ వాంటెడ్ లిస్టులోకి చేర్చారు. ఈ మోస్ట్ వాంటెడ్ లేడీని పట్టిస్తే రూ. 10 వేల నగదు బహుమతి ఇస్తామని ప్రకటించారు తూ ర్పుగోదావరి జిల్లా పోలీసులు. జగదాంబ కనిపిస్తే.. 9491326456 లేదా 996333265 నంబర్లకు సమాచారం ఇవ్వాలని సూచించారు.