- 19 మంది ఎంపీల సగటు ఏడాది ఆదాయం రూ.1.05 కోట్లు
- 16.30 కోట్ల ఇన్ కంతో టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ టాప్
- అత్యధిక, అత్యల్ప ఆదాయమున్నఎంపీల లిస్టు ప్రకటించిన ఏడీఆర్
దేశవ్యాప్తంగా ఎక్కువ వార్షికాయదాయం ఉన్నఎంపీల్లో ఆంధ్రప్రదేశ్ కు చెందినవారే టాప్ లో నిలిచారు. ఆ రాష్ట్రంలోని 19 మంది ఎంపీల సగటు వార్షికాదాయం ఏకంగా రూ.1.05 కోట్లు గా ఉన్నట్టు అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్)సంస్థ వెల్లడించింది. 2014లో ఎంపికైన లోక్ సభ సభ్యుల్లో టాప్-20, అతి తక్కువ ఉన్న20 మంది ఎంపీల లిస్టును ఆ సంస్థ వెల్లడించింది. అందులో రూ.16.30 కోట్ల వార్షికాదాయంతో గుంటూరు టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ ఫస్ట్ ప్లేస్ లో నిలిచారు.తర్వాత గుజరాత్ లోని అహ్మదాబాద్ ఈస్ట్ బీజేపీ ఎంపీ పరేశ్ దహ్యాలాల్ రావల్ (రూ.8.22 కోట్లు), యూపీలోని అమ్రొహా బీజేపీ ఎంపీ కన్వర్ సింగ్ తన్వర్ (రూ.8.12 కోట్లు ), ఒడిశాలోని బాలాసోర్ బీజేడీ ఎంపీ రవీంద్రకుమార్ జెనా (రూ.4.89 కోట్లు )తదితరులు నిలిచారు. ఇక ఈ జాబితాలో రూ.1.86కోట్ల ఆదాయంతో ఏపీకి చెందిన నంద్యాల ఎంపీ ఎస్పీవై రెడ్డి 14వ స్థా నంలో ఉన్నారు. ఒడిశాలోని15 మంది ఎంపీలు సగటున 68.8 లక్షలు పొందు-తున్నట్టు ఏడీఆర్ రిపోర్టు తెలిపింది.
తక్కువ ఆదాయమున్న ఎంపీలు
అతి తక్కు వ ఆదాయం ఉన్న ఎంపీల్లో కూడా తెలుగువారు ఉన్నారు. విజయవాడ ఎంపీ కేశినేని శ్రీనివాస్ 2.06 కోట్ల రూపాయల నష్టంతో ఫస్ట్ ప్లేస్ లో, రూ. 1,52,250 ఆదాయంతో ఆదిలాబాద్ నియోజకవర్గం టీఆర్ఎస్ ఎంపీ గోడం నగేశ్ ఆరో స్థానంలో ఉన్నారు. రామ్ టెక్ శివసేన ఎంపీ కృపాల్ బాలాజీ తుమానె (రూ.97,243), రత్నగిరి సింధుదుర్గ్ శివసేన ఎంపీ వినాయక్ బారు రౌత్ (రూ.94,320), కల్యాణ్ ఎంపీ శ్రీకాంత్ ఏక్ నాథ్‌షిండే (రూ.96,126), చిదంబరం ఏఐడీఎంకే ఎంపీఎం.చంద్రకాశి (రూ1,47,796) రెండు నుంచి ఐదు స్థానాల్లో ఉన్నారు.
ప్రొఫెషన్ వారీగా ఆదాయం
సిట్టింగ్ ఎంపీల్లో 98 మంది వ్యాపారులు, 91 మంది వ్యవసాయదారులు ఉన్నట్టు ఏడీఆర్ చెప్పిం ది. నిరక్షరాస్యుడైన ఓ ఎంపీ వార్షికాదాయం రూ.75.35 లక్షలుకాగా, ఐదో తరగతి విద్యార్హత ఉన్న ఆరుగురుఎంపీల మొత్తం ఆదాయం రూ.8.48 కోట్లు . పీజీ చదివిన 134 మంది ఎంపీల ఆదాయం రూ.32కోట్లు , డాక్టరేట్ పూర్తిచేసిన 30 మంది ఆదాయం రూ.4 కోట్లు గా తెలిపింది. 42 మంది ఎంపీలు వార్షికాదాయం ఎంతనేది పేర్కొనలేదు. వీరిలో నాగర్ కర్నూల్ ఎంపీ నంది ఎల్లయ్య, కాకినాడ ఎంపీ తోటవెంకట నరసింహం ఉన్నారు.