Chhaava Controversy: ఏపీలో ఛావా సినిమాపై వివాదం.. రిలీజ్‌ ఆపాలంటూ కలెక్టర్‌కి విజ్ఞప్తి!

Chhaava Controversy: ఏపీలో ఛావా సినిమాపై వివాదం.. రిలీజ్‌ ఆపాలంటూ కలెక్టర్‌కి విజ్ఞప్తి!

బాలీవుడ్ స్టార్ హీరో విక్కీ కౌశల్ నటించిన చావా తెలుగు రిలీజ్ చుట్టూ వివాదం ముదురుతోంది. ఛావాను తెలుగులో గీతా ఆర్ట్స్ బ్యానర్ పై బ‌న్నీ వాస్ రిలీజ్ చేస్తోన్నారు. రేపు (మార్చి 7న) చావా థియేట‌ర్ల‌లో వస్తోంది. ఈ క్రమంలో ఛావా వివాదంలో చిక్కుకుంది. 

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని 'ముస్లిం ఫెడరేషన్ అఫ్ ఆంధ్రప్రదేశ్ ప్రెసిడెంట్ మహ్మద్ జియా ఉల్ హాక్' ఇటీవల నెల్లూరు జిల్లా కలెక్టర్‌ను కలిసి ఛావా రిలీజ్‌ను ఆపాలంటూ విజ్ఞప్తి చేస్తూ.. మెమోరాండం స‌మ‌ర్పించారు. చ‌రిత్ర‌ను వ‌క్రీక‌రించి ఛావా సినిమా తీశార‌ని మెమోరండంలో జియా ఉల్ హాక్ పేర్కొన్న‌ట్లు తెలిసింది.

ALSO READ | Bigg Boss: బిగ్ బాస్ తెలుగు సీజన్ 9కి కొత్త హోస్ట్.. నాగార్జున స్థానంలో టాలీవుడ్ యంగ్ హీరో!

అలాగే, ఈ మూవీలో 16వ శతాబ్దం నాటి ఔరంగజేబుని క్రూరుడిగా చిత్రీకరించారని, అందువల్ల రిలీజ్కు ముందు నార్త్ ఇండియాలో గొడవలు జరిగాయని, ఏపీలోనూ అలాంటి మత ఘర్షణలకు అవకాశం ఉందని తెలిపారు. కనుక సినిమాను విడుదల కాకుండా అడ్డుకోవాలంటూ జియా ఉల్‌ హకీ డిమాండ్‌ చేస్తున్నాడు. మరి కలెక్టర్ నుంచి ఎలాంటి నిర్ణయం వస్తుందో అని ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది.

ఛావా రిలీజ్ కు కేవలం ఒక్కరోజే మాత్రమే ఉండటంతో.. అసలు ఏపీలో రేపు సినిమా రిలీజ్ అవుతుందా.. లేదా అనేది ఆడియన్స్ కంగారుపడుతున్నారు. అయితే, ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాలలో టికెట్ బుకింగ్స్ కూడా జరిగిపోయాయి.

"చావా" సినిమా ఫిబ్రవరి 14న హిందీలో రిలీజ్ అయ్యింది. ఈ సినిమాలో మహారాజా ఛత్రపతి శివాజీ మరియు జీజాబాయిల పెద్ద కుమారుడు మహారాజ్ శంభాజీ పాలన గురించి తెరకెక్కించబడింది. ఈ సినిమాలో శంభాజీ భార్య మహారాణి యేసుబాయి భోంసాలే పాత్రలో రష్మిక మందన్న నటించింది. అక్షయ్ ఖన్నా చక్రవర్తి ఔరంగజేబు పాత్రను పోషించాడు. ఈ హిస్టారిక్ యాక్షన్ డ్రామా మూడు వారాల్లోనే వరల్డ్ వైడ్ గా రూ.500 కోట్ల నెట్ క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టింది. ఇక ఇప్పుడు రూ.1000 కోట్ల దిశగా దూసుకెళ్తోంది.