
ఏపీ కొత్త మంత్రి వర్గం కొలువు దీరింది. రాష్ట్ర నూతన హోంమంత్రిగా మేకతోటి సుచరిత నియమితులయ్యారు. సీఎం జగన్ నాయకత్వంలో పనిచేసే 25 మందితో కూడిన నూతన క్యాబినెట్ ఈ ఉదయం వెలగపూడి సచివాలయం వద్ద ప్రమాణస్వీకారం చేసింది. కాగా, కొత్త మంత్రులకు శాఖలు కేటాయించారు. ఈ మేరకు గవర్నర్ నరసింహన్ ఆమోదం తెలిపారు.
కేటాయించిన శాఖలు వివరాలు
1) మేకతోటి సుచరిత (గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం)- హోం శాఖ, విపత్తుల నివారణ శాఖ
2)బొత్స సత్యనారాయణ (విజయనగరం జిల్లా చీపురు పల్లి నియోజకవర్గం) – మున్సిపల్ , అర్బన్ డెవలప్ మెంట్
3)పుష్పశ్రీ వాణి (విజయనగరం కురుపాం నియోజకవర్గం)- డిప్యూటీ సీఎం, గిరిజన సంక్షేమ శాఖ
4) ధర్మాన కృష్ణదాస్ (శ్రీకాకుళం జిల్లా నరసన్న పేట నియోజకవర్గం)- రోడ్లు, భవనాల శాఖ
5)కురసాల కన్నబాబు (తూర్పుగోదావరి జిల్లా కాకినాడ రూరల్ నియోజకవర్గం)- వ్యవసాయ శాఖ
6)పిల్లి సుభాష్ చంద్రబోస్ (తూర్పుగోదావరి జిల్లా (ఎమ్మెల్సీ కోట)) – డిప్యూటి సీఎం, రెవిన్యూ శాఖ
7)పినిపె విశ్వరూప్ (తూర్పుగోదావరి జిల్లా అమలాపురం నియోజకవర్గం) – సాంఘీక సంక్షేమ శాఖ
8)ఆళ్ల కాళీ కృష్ణ శ్రీనివాస్( నాని) ( పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు నియోజకవర్గం)- డిప్యూటి సీఎం, వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ
9)చెరుకువాడ శ్రీరంగనాథరాజు (పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట నియోజకవర్గం)- గృహ నిర్మాణ శాఖ
10 తానేటి వనిత (పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు నియోజకవర్గం) – మహిళా శిశు సంక్షేమ శాఖ
11)కొడాలి శ్రీ వెంకటేశ్వర్ రావు(నాని) (కృష్ణా జిల్లా గుడివాడ నియోజకవర్గం)- పౌర సరఫరాలు, వినియోగదారుల శాఖ
12)పేర్ని వెంకట్రామయ్య(నాని) (కృష్ణా జిల్లా మచిలీపట్నం నియోజకవర్గం)- రవాణా సమాచార శాఖ
13)వెల్లంపల్లి శ్రీనివాస్ (కృష్ణా జిల్లా విజయవాడ (పశ్చిమ) నియోజకవర్గం)- దేవాదాయ శాఖ
14) ముత్తం శెట్టి శ్రీనివాస రావు(అవంతి శ్రీనివాస్) (విశాఖ పట్నం భీమిలి నియోజకవర్గం)- పర్యాటక శాఖ
15)మోపిదేవి వెంకటరమణ (గుంటూరు జిల్లా రేపల్లె నియోజకవర్గం)- పశుసంవర్ధక , మత్స్య, మార్కెటింగ్ శాఖ
16)బాలినేని శ్రీనివాస్ రెడ్డి (ప్రకాశంజిల్లా ఒంగోలు నియోజకవర్గం)- అటవీ, పర్యావరణ, సైన్స్ అండ్ టెక్నాలజీ
17)ఆదిమూలపు సురేశ్ ( ప్రకాశంజిల్లా ఎర్రగొండపాలెం నియోజకవర్గం) – విద్యాశాఖ
18)అనిల్ కుమార్ (నెల్లూరు జిల్లా నెల్లూరు సిటీ నియోజకవర్గం)- జలవనరుల శాఖ
19)మేకపాటి గౌతమ్ రెడ్డి (నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గం)- పరిశ్రమలు, వాణిజ్య శాఖ
20)పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి (చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గం)- పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, మైనింగ్
21)కె. నారాయణ స్వామి (చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గం) – డిప్యూటి సీఎం,వాణిజ్య పన్నుల శాఖ
22)బుగ్గన రాజేంద్ర నాథ్ రెడ్డి (కర్నూలు జిల్లా డోన్ నియోజకవర్గం)- ఆర్ధిక, ప్రణాళిక, అసెంబ్లీ వ్యవహారాల శాఖ
23) గుమ్మనూరు జయరాం (కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గం)- కార్మిక, ఉపాధి, పరిశ్రమల శాఖ
24) అంజద్ బాషా (కడప జిల్లా కడప నియోజకవర్గం) – డిప్యూటి సీఎం, మైనార్టీ శాఖ
25)ఎం.శంకర్ నారాయణ (అనంతపురం జిల్లా పెనుకొండ నియోజకవర్గం)- బీసీ సంక్షేమ శాఖ