తెలంగాణ ప్రాజెక్టులపై ఏపీ అభ్యంతరం

  • రాజ్యసభలో కేంద్రం వెల్లడి

న్యూఢిల్లీ, వెలుగు: కృష్ణా నదిపై తెలంగాణ చేపడుతోన్న 8 ప్రాజెక్టులపై ఏపీ సర్కార్ అభ్యంతరం వ్యక్తం చేసినట్లు కేంద్రం తెలిపింది. ఈ ప్రాజెక్టుల డీపీఆర్ లను కృష్ణా రివర్ మేనేజ్ మెంట్ బోర్డు(కేఆర్ఎంబీ)కు  సమర్పించాలని అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ లో కేంద్ర జలశక్తి శాఖను ఏపీ కోరినట్లు వెల్లడించింది. 'కేంద్ర ప్రభుత్వ అనుమతులు లేకుండా తెలంగాణ ఏమైనా ప్రాజెక్టులు చేపడుతోందా? ఏపీ నుంచి అందిన ఫిర్యాదులపై తెలపాలని ఎంపీ టీజీ వెంకటేశ్ అడిగిన ప్రశ్నకు కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ సోమవారం రాతపూర్వక సమాధానం ఇచ్చారు.