కాంగ్రెస్ పెద్దలను కలిసిన షర్మిల..

ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీ పెద్దలను కలిశారు. పార్టీ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే, జనరల్ సెక్రెటరీ కేసి వేణుగోపాల్ లను మర్యాదపూర్వకంగా కలిశారు. రాష్ట్ర కాంగ్రెస్ బలోపేతానికి తదుపరి కార్యాచరణ అంశంలో తన ప్రణాళికలు వివరించటం జరిగిందని, ఖర్గే, వేణుగోపాల్ లు అమూల్యమైన సలహాలు అందించారని తెలిపారు.

రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో పోషించే పాత్ర మరింత ప్రాముఖ్యం సంతరించుకుంటుందని, దానికి వారి మద్దత్తు అన్నివేళలా ఉంటుందని హామీ ఇచ్చారని తెలిపారు షర్మిల. ఈ మేరకు తన ఎక్స్ ఖాతాలో ట్వీట్ చేశారు షర్మిల. 2024 సార్వత్రిక ఎన్నికల సమయంలో ఏపీలో ముమ్మరంగా ప్రచారం చేశారు. పార్టీకి అన్నీ తానై ముందుకు నడిపినప్పటికీ కాంగ్రెస్ ఏపీలో ఖాతా తెరవలేకపోయింది. ప్రస్తుతం కాంగ్రెస్ పాటి కేంద్రంలో బలమైన ప్రతిపక్షంగా ఉన్న నేపథ్యంలో కాంగ్రెస్ పెద్దలతో షర్మిల భేటీ ప్రాధాన్యతను సంతరించుకుంది.