- అవినీతిపై మాట్లాడుతున్నానే జగన్ ఆస్తి పంపకాలు చేస్తలేరు
- అమెరికా కోర్టు చెప్పే వరకు ఈడీ, సీబీఐ, ఐటీ ఏం చేస్తున్నాయ్
- జగన్.. అదానికి ఏపీని అప్పనంగా కట్టబెట్టారు
- నా బిడ్డలపై ప్రమాణం చేస్తున్నా.. ప్రభాస్ ఎవరో నాకు తెలియదు
- ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అదానిని బ్లాక్ లిస్టులో పెట్టాలని, ఆయన కంపెనీలతో చేసుకున్న అగ్రిమెంట్లను రద్దు చేయాలని ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల అన్నారు. ఇవాళ లోటస్ పాండ్ లో ఆమె విలేకరులతో మాట్లాడారు. తాను జగన్ అవినీతిపై మాట్లాడుతున్నందనే ఆస్తిపంపకాలు చేయడం లేదని అన్నారు. జగన్, అదాని బంధంపై తనదైన శైలిలో విమర్శలు చేశారు. 2021లో ఏపీ ప్రభుత్వానికి ముడుపులు ముట్టినట్టు జస్టిస్ డిపార్ట్మెంట్ ఆఫ్ యూఎస్ఏ చెబుతోందని షర్మిల అన్నారు. ఇందులో ఏపీ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి కి ఇచ్చినట్టు వెల్లడించారని అన్నారు. ఆయన పేరు డైరెక్టుగా చెప్పకున్నా సీఎం అని ప్రస్తావించిందన్నారు. పవర్ సప్లై లో ఏపీ సీఎం ను గౌతం అదానీ జగన్ ను కలిసి మీకు ఏమి కావాలో ఇస్తామని ప్రామిస్ చేశారని ఆరోపించారు. అమెరికా కు జగన్ డైరెక్ట్ ఇంట్రెస్ట్ పార్టీ కాదు కాబట్టే జగన్మోహన్ రెడ్డి పై కేసు నమోదు కాలేదన్నారు. 1750 కోట్ల రూపాయలు జగన్ కు లంచం ఇచ్చారని స్పష్టంగా పేర్కొన్నారని షర్మిల చెప్పారు. అమెరికా బయట పెట్టే వరకు మనకు తెలియక పోవడం విడ్డూరంగా ఉందన్నారు.
మన దేశంలో ఉన్న సీబీఐ, ఐటీ, ఏం చేస్తున్నాయని ఆమె ప్రశ్నించారు. అదానీ దేశ పరువు తీస్తే, జగన్ ఏపీ పరువు తీశారని ఆరోపించారు. గన్నవరం, కృష్ణపట్నం పోర్టులను అదానికి జగన్ ఎందుకు కట్టబెట్టారని అన్నారు. ఆంధ్రరాష్ట్రాన్ని అదానికి అప్పనంగా రాసిచ్చారని ఆరోపించారు. తన బిడ్డలపై ప్రమాణం చేసి చెప్తున్నానని, ప్రభాస్ ఎవరో తనకు తెలియదని అన్నారు. తనకు ప్రభాస్ తో సంబంధం అంటగట్టి వైసీపీ సైన్యమే దుష్ప్రచారం చేసిందని అన్నారు. వైఎస్ జగన్ కు చెల్లె మీద ప్రేమ ఉంటే బాలకృష్ణ బిల్డింగ్ లో ఉన్న ఐపీ అడ్రెస్ నుంచి హీరో ప్రభాస్ , నాకు సంబంధంఉంది అని ప్రచారం చేశారు అంటున్నారని, ఆయన సీఎం అయ్యాక ఎందుకు విచారణ జరిపించలేదని అన్నారు. జగన్ నా వీడియో ప్రెస్ మీట్ లో చూపించి మీకు అనుకూలఅంగ ఉపయోగించుకున్నారని ఆరోపించారు.