![ప్రభుత్వం అనుచిత పోస్టులు..తెలంగాణ వ్యక్తిని అరెస్ట్ చేసిన ఏపీ పోలీసులు](https://static.v6velugu.com/uploads/2024/11/ap-police-has-arrested-a-man-in-nizamabad-for-posting-inappropriate-posts-on-social-media_JWk9ExnYQU.jpg)
ఏపీ ప్రభుత్వంపై సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు పెట్టాడంటూ నిజామాబాద్ లో ఓ వ్యక్తిని ఏపీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, హోంమినిస్టర్ వంగలపూడి అనితపై అనుచిత పోస్టులు పెట్టింది మెండోరా మండలానికి చెందిన బద్దం అశోక్ రెడ్డిగా గుర్తించిన ఏపీ పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. స్థానిక పోలీసులకి సమాచారం ఇచ్చిన ఏపీ పోలీసులు నవంబర్ 3న రాత్రి అశోక్ రెడ్డిని అరెస్ట్ చేశారు. అయితే తమకు కు ఎలాంటి సమాచారం ఇవ్వలేదని అతని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఏపీలో ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చడం లేదని.. కూటమి సర్కార్ అపుడే విఫలమైందని బద్దం అశోక్ రెడ్డి పేరుతో సోషల్ మీడియాలో పోస్టులు ఇటీవల వైరల్ అయ్యాయి. ఏపీ అత్యాచార ఆంధ్రప్రదేశ్ గా మారిందని.. శాంతిభద్రతలను పూర్తిగా గాలికొదిలేశారని పోస్టు పెట్టాడు. ఈ క్రమంలో పోస్టులు పెట్టింది నిజామాబాద్ జిల్లాకు చెందిన బద్దం అశోక్ రెడ్డిగా గుర్తించి నిందితుడిని అరెస్ట్ చేశారు.