కడప జిల్లా వ్యాప్తంగా వైసీపీ సోషల్ మీడియా కన్వీనర్లకు నోటీసులు

కడప జిల్లా వ్యాప్తంగా వైసీపీ సోషల్ మీడియా కన్వీనర్లకు నోటీసులు

ఏపీలో వైసీపీ సోషల్ మీడియా కన్వీనర్ల అరెస్టుల పర్వం కొనసాగుతోంది. జగన్ అధికారంలో ఉన్న సమయంలో పలువురు టీడీపీ నేతలను, వారి వారి కుటుంబాల పట్ల సోషల్ మీడియా వేదికగా అసభ్యకరంగా పోస్టులు పెట్టడం, వ్యక్తిగత దూషణకు పాల్పడ్డారనే దానిపై ఈ అరెస్టులు జరుగుతున్నాయి. ఇప్పటికే ముఖ్యమైన వారిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. మరికొందరిని అరెస్ట్ చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలో కడప జిల్లా వ్యాప్తంగా వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి చెందిన సోషల్ మీడియా కన్వీనర్లకు పోలీసులు 41ఏ కింద నోటీసులు జారీ చేశారు.

ALSO READ : అమరావతి భూ కేటాయింపులపై కేబినెట్ సబ్ కమిటీ కీలక భేటీ

అవినాష్‌ రెడ్డి పీఏ రాఘవరెడ్డి

నోటీసులు అందిన వారిలో కడప ఎంపీ వైఎస్‌ అవినాష్‌ రెడ్డి పీఏ రాఘవ రెడ్డితో పాటు వైసీపీ సోషల్ మీడియా కన్వీనర్ వివేక్ రెడ్డి, అర్జున్ రెడ్డి ఉన్నారు. వీరు అందుబాటులో లేకపోవడంతో పోలీసులు వారి వారి ఇళ్లకు నోటీసులు అంటించారు. అవినాష్‌ రెడ్డి పీఏ రాఘవరెడ్డి సొంత గ్రామమైన అంబకపల్లెలోని నివాసానికి పోలీసులు నోటీసులు అంటించారు. వీరితోపాటు జిల్లా వ్యాప్తంగా సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉండే పలువులు వైసీపీ కార్యకర్తలకు నోటీసులు అందినట్లు తెలుస్తోంది. విచారణకు హాజరవ్వాలని నోటీసులు పేర్కొన్నట్లు సమాచారం.