AP Rains update: ఆకాశానికి చిల్లి పడింది... మూడు రోజుల పాటు విస్తారంగా భారీ వర్షాలు

AP Rains update: ఆకాశానికి చిల్లి పడింది...  మూడు రోజుల పాటు విస్తారంగా భారీ వర్షాలు

ఆంధ్రప్రదేశ్‌‌ను వర్షాలు వణికిస్తున్నాయి.. అల్పపీడనం ప్రభావంతో రెండు రోజులుగా వానలు ఊపందుకున్నాయి. వాయవ్య బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడింది.. ఇప్పటికే మరో అల్పపీడనం కొనసాగుతోంది. వచ్చే  మూడు రోజుల్లో (జులై 20 నుంచి) రెండో అల్పపీడనం మరింత బలపడి వాయవ్య దిశగా ఒడిశా తీరంవైపు కదిలే అవకాశం ఉందని  వాతావరణ శాఖాధికారులు అంచనా వేస్తున్నారు. ఈ ప్రభావంతో కోస్తా, రాయలసీమల్లో మరో రెండు రోజుల పాటు ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ తెలిపింది. పలు జిల్లాల్లో గంటకు 30 నుంచి 40 కి.మీ. వేగంతో గాలులు వీస్తాయంటున్నారు.

ప్రస్తుతానికి బంగాళాఖాతంలో  ఏర్పడిన  వాయుగుండంగా మారింది. జులై 20 వ తేదీ అర్దరాత్రి  తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ తెలిపింది. ఈ మేరకు కోస్తాలో అతి భారీ వర్షం కురిసే అవకాశం ఉందని పేర్కొంది. దీంతో అధికారులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచించారు. వాయువ్య తీరానికి  ఆనుకుని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఒడిశా, దానికి ఆనుకుని ఉన్న ఉత్తర ఆంధ్ర ప్రదేశ్ తీరాలలో అనగా పూరీకి ఆగ్నేయంగా 70 కిమీ (ఒడిశా), గోపాల్‌పూర్ (ఒడిషా)కి తూర్పున 130 కిమీ, పారాదీప్ (ఒడిషా)కి ఆగ్నేయంగా 130 కిమీ, కళింగపట్నం (ఆంధ్రప్రదేశ్)కి తూర్పు-ఈశాన్యంగా 240 కి.మీ. అల్పపీడన ప్రాంతం కేంద్రీకృతమై ఉన్నది . ఇది  జూలై 20, 2024 తెల్లవారుజామున వాయువ్య దిశగా పయనించి, పూరీ సమీపంలో ఒడిశా తీరాన్ని దాటే అవకాశం ఉంది.

 ఆ తర్వాత, ఒడిశా ,  ఛత్తీస్‌గఢ్ మీదుగా పశ్చిమ-వాయువ్య దిశగా కదిలి, తదుపరి 24 గంటల్లో క్రమంగా బలహీనపడుతుంది. సగటుసముద్ర మట్టానికి 1.5 కి.మీ వద్ద ఉన్న ఋతుపవన ద్రోణి ఇప్పుడు జైసల్మేర్, కోటా, గుణ, సాగర్, రాయ్‌పూర్, పూరీ మీదుగా ఆగ్నేయ దిశగా ఒడిశాను ఆనుకుని ఉన్న ఉత్తర ఆంధ్ర ప్రదేశ్ తీరాల నుండి వాయువ్య, దాన్ని ఆనుకుని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతం మీదుగా అల్పపీడనం మధ్యలోకి వెళుతుంది.సగటు సముద్ర మట్టం నుండి 3.1 నుంచి  5.8 కిమీల మధ్య షీర్ జోన్ సుమారుగా 20° ఉత్తర అక్షాంశము వద్ద దక్షిణం వైపు వంగి ఉంటుందని వాతావరణ శాఖ ప్రకటించింది. .

 మరో మూడు రోజుల పాటు వర్షాలు కొనసాగుతాయన్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రధాన ఓడరేవుకు ప్రమాద హెచ్చరికలు జారీ చేసినట్లు అధికారులు తెలిపారు.
 ప్రకాశం, నంద్యాల జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయంటోంది ఏపీ విపత్తుల సంస్థ. శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలకు అవకాశం ఉందంటున్నారు. విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, చిత్తూరు, కర్నూలు, అనంతపురం, శ్రీసత్యసాయి, కడప, అన్నమయ్య జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తు సూచిస్తున్నారు.