
ఆంధ్రప్రదేశ్‌లో ఖాళీగా ఉన్న రాజ్యసభ స్థానానికి నామినేషన్ల దాఖలు గడువు సమీపిస్తోంది. ఈ క్రమంలో ఏపీ రాజ్యసభ స్థానానికి బీజేపీ తన అభ్యర్థిని ఖరారు చేసింది.బీజేపీ కోటా కింద పాకా వెంకట సత్యనారాయణ రాజ్యసభ అభ్యర్థిగా ఖరారయ్యారు. వైఎస్సార్‌సీపీ నేత విజయసాయి రెడ్డి రాజీనామాతో ఏర్పడిన ఈ ఖాళీకి నామినేషన్ ప్రక్రియ రేపు ( ఏప్రిల్ 29) మధ్యాహ్నం 3 గంటలకు ముగుస్తుంది. కూటమి అభ్యర్థిగా పాక వెంకట సత్యనారాయణ రేపు నామినేషన్ దాఖలు చేయనున్నారు.
ఏపీ రాజ్యసభ అభ్యర్థిగా బీజేపీ నేత పాక వెంకటసత్యనారాయణను బీజేపీ అధికారికంగా ప్రకటించింది. బీజేపీ ఏపీ కోర్ గ్రూప్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. బీజేపీ ఏపీ కోర్ సమావేశంలో యూరప్ నుంచి ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి పాల్గొన్నారు. పాకా వెంకటసత్యనారాయణవైపు అధిష్ఠానం మొగ్గుచూపింది.