వారం రోజుల్లో 3.11 లక్షల మందికి పరీక్షలు
అమరావతి: కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్న కొద్దీ పరీక్షల సంఖ్యను మరింతగా పెంచుతోంది ఏపీ ప్రభుత్వం. తద్వారా వైరస్ వ్యాప్తి కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. కేవలం వారం రోజుల్లోనే దేశంలో ఏ రాష్ట్రం చేయని విధంగా 3,11,290 పరీక్షలు చేసింది. ఇందులో కంటైన్మెంట్ జోన్లలో చేసిన పరీక్షలే అధికం. గడచిన 24 గంటల్లో 53,681 మందికి కోవిడ్–19 నిర్ధారణ పరీక్షలు నిర్వహించినట్టు వైద్య, ఆరోగ్య శాఖ శనివారం విడుదల చేసిన బులెటిన్‌లో పేర్కొంది. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు చేసిన మొత్తం పరీక్షల సంఖ్య 15,95,674కి చేరింది. కొత్తగా 7,813 పాజిటివ్ కేసులు నమోదు కావడంతో మొత్తం కేసుల సంఖ్య 88,671కి చేరింది. ఇదే సమయంలో 3,265 మంది డిశ్చార్జి కావడంతో మొత్తం కోలుకున్న వారి సంఖ్య 43,255కి చేరింది. వివిధ జిల్లాల్లో 52 మంది మరణించడంతో రాష్ట్రవ్యాప్తంగా మొత్తం మరణాల సంఖ్య 985కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 44,431 కేసులు యాక్టివ్ గా ఉన్నట్లు వైద్యారోగ్య శాఖ తెలిపింది.
For More News..