ఏపీలో ఇవాళ ఒక్కరోజే 6,770 కేసులు

ఏపీలో ఇవాళ ఒక్కరోజే 6,770 కేసులు
  • రాష్ట్ర వ్యాప్తంగా కరోనాతో 58 మంది మృతి
  • చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 12 మంది కరోనాతో మృతి

అమరావతి: ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. తాజాగా ఇవాళ ఒక్కరోజే 6,770 కేసులు నమోదయ్యాయి. అలాగే మరణాలు కూడా 58 నమోదయ్యాయి. కరోనా మరణాల్లో ఇవాళ తక్కువ సంఖ్యలో నమోదు కావడంతో మరణాలు తగ్గుముఖంపడుతున్నట్లు అర్థం అవుతోంది. 
రాష్ట్రంలోని 13 జిల్లాల్లో మొత్తం 59 మంది కరోనాతో పోరాడుతూ మృతి చెందగా.. ఒక్క చిత్తూరు జిల్లాలోనే అత్యధికంగా 12 మంది చనిపోయారు. అలాగే ఉభయ గోదావరి జిల్లాల్లో ఏడుగురు చొప్పున చనిపోయారు. అలాగే శ్రీకాకుళం జిల్లాలో ఆరుగురు, అనంతపురం, విశాఖపట్టణం జిల్లాల్లో నలుగురు చొప్పున, కడప, కృష్ణ, ప్రకాశం, విజయనగరం జిల్లాల్లో ముగ్గురు చొప్పున, గుంటూరు, కర్నూలు, నెల్లూరు జిల్లాల్లో ఇద్దరేసి చొప్పున కరోనాతో పోరాడుతూ చనిపోయారు. 
మరోవైపు గడచిన 24 గంటల్లో 12 వేల 492 మంది కరోనా నుంచి కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో ఆస్పత్రుల నుండి డిశ్చార్జ్ అయినట్లు ఏపీ వైద్య ఆరోగ్యశాఖ ప్రకటించింది. రాష్ట్రంలోని 13 జిల్లాల్లో గడచిన 24 గంటల్లో 1 లక్షా 2 వేల 876 మందికి వైద్య పరీక్షలు చేయగా వారిలో 6770 మందికి కరోనా సోకినట్లు నిర్ధారణ అయింది. జిల్లాల వారీగా నమోదైన కరోనా పాజిటివ్ కేసుల వివరాలు ఇలా ఉన్నాయి.