ఆస్ట్రో ఆఫ్‌‌‌‌షోర్‌‌‌‌లో ఏపీసెజ్​కు 80 శాతం వాటా

ఆస్ట్రో ఆఫ్‌‌‌‌షోర్‌‌‌‌లో ఏపీసెజ్​కు 80 శాతం వాటా

న్యూఢిల్లీ: అదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనామిక్ జోన్ లిమిటెడ్ (ఏపీసెజ్​) ఆస్ట్రో ఆఫ్‌‌‌‌షోర్​లో 80 శాతం వాటాను కొనుగోలు చేసేందుకు ఒప్పందం కుదుర్చుకున్నట్లు శుక్రవారం తెలిపింది. ఈ ఆల్​క్యాష్​డీల్​ విలువ185 మిలియన్ డాలర్లని (దాదాపు రూ.1,551 కోట్లు),   ఆస్ట్రో ప్రస్తుత ప్రమోటర్ల దగ్గర మిగిలిన 20 శాతం వాటా ఉంటుందని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. 2009లో ఏర్పాటైన ఆస్ట్రో ఆఫ్​షోర్​ మిడిల్ ఈస్ట్, ఇండియా, ఫార్ ఈస్ట్ ఆసియా  ఆఫ్రికాలో ప్రముఖ గ్లోబల్ ఓఎస్​వీ ఆపరేటర్ అని ఏపీసెజ్​​తెలిపింది.

దీనికి  యాంకర్ హ్యాండ్లింగ్ టగ్‌‌‌‌లు , ఫ్లాట్ టాప్ బార్జ్‌‌‌‌లు, మల్టీపర్పస్ సపోర్ట్ వెస్సెల్స్,   వర్క్‌‌‌‌బోట్‌‌‌‌లతో కూడిన 26 ఆఫ్‌‌‌‌షోర్ సపోర్ట్ వెస్సెల్స్ (ఓఎస్​వీలు) ఉన్నాయి. నౌకల నిర్వహణ,  కాంప్లిమెంటరీ సేవలను అందిస్తుంది.  ఏప్రిల్ 30, 2024తో ముగిసిన సంవత్సరంలో  95 మిలియన్​ డాలర్ల ఆదాయాన్ని,   41 మిలియన్ డాలర్ల ఇబిటాను సాధించింది.