
న్యూఢిల్లీ: గౌతమ్ అదానీ సంస్థ అదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనామిక్ జోన్ లిమిటెడ్ (ఏపీ సెజ్) సోమవారం శ్రీలంకలోని డీప్వాటర్ టెర్మినల్కొలంబో వెస్ట్ ఇంటర్నేషనల్ టెర్మినల్‌లో (సీడబ్ల్యూఐటీ) కార్యకలాపాలు ప్రారంభించినట్లు తెలిపింది. ప్రభుత్వ- ప్రైవేట్ భాగస్వామ్యంలో దీనిని అభివృద్ధి చేశారు. బిల్డ్, ఆపరేట్ ట్రాన్స్‌ఫర్ (బీఓసీ) ఒప్పందం విధానంలో దీనిని 35 సంవత్సరాలపాటు ఏపీ సెజ్, జాన్ కీల్స్ హోల్డింగ్స్, శ్రీలంక పోర్ట్స్ అథారిటీతో కూడిన ఒక కన్సార్టియం నిర్వహిస్తుంది.
సీడబ్ల్యూఐటీ కోసం 800 మిలియన్ డాలర్లను పెట్టుబడి పెట్టారు. ఈ టర్మినల్ 1,400 క్వే మీటర్ల పొడవు, 20 మీటర్ల లోతు ఉంటుంది. ఇది సరుకులను మరింత సమర్థంగా రవాణా చేయడానికి సాయపడుతుందని ఏజీ సెజ్తెలిపింది. సీడబ్ల్యూఐటీ ప్రాజెక్ట్ స్థానికంగా వేలాది మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉద్యోగాలను సృష్టిస్తుందని గౌతమ్ అదానీ తెలిపారు.