ఏపీకి ప్రత్యేక హోదా.. కాంగ్రెస్​ తోనే సాధ్యం: ఏపీ పీసీసీ చీఫ్​ షర్మిల

ఆంధ్రప్రదేశ్​కు ప్రత్యేకహెూదా కాంగ్రెస్ తోనే  సాధ్యమని ఏపీ పీసీసీ చీఫ్​ వైఎస్​ షర్మిల అన్నారు.   కేంద్రంలోను ... రాష్ట్రంలోను కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే మొదటి సంతకం ప్రత్యేక హెూదా ఫైలుపైనే  నని ఆమె  స్పష్టం చేసారు.  విజయవాడ గాంధీ భవన్​ లో ఆమె మాట్లాడుతూ బీజేపీ, టీడీపీ, వైసీపీ పార్టీలు  ఆంద్రప్రదేశ్ రాష్ట్రానికి తీరని ద్రోహం చేసారని   ఆరోపించారు. కాంగ్రెస్​ అధికారంలోకి వస్తే  ప్రతి పేద కుటుంబానికి రూ.5 వేలు చొప్పున అ ఇంటి గృహిణికి ఖాతాలో జమ అయ్యేటట్టుగా ఆర్థిక సహాయం చేస్తామన్నారు.

ALSO READ :- తెలంగాణ పోలీస్ శాఖకు 50 బ్రీత్ అనలైజర్స్ అందజేత

 పోలవరం ప్రాజెక్ట్ పూర్తి చేయకుండా  కాలయాపన చేశారని విమర్శించారు. ప్రత్యేకహెుదా వచ్చివుంటే భారీ పరిశ్రమలు వచ్చేవని .... వాణిజ్య పన్ను, ఆదాయ పన్ను కట్టకుండా రాయితీలు వచ్చేవన్నారు. రాష్ట్ర విభజన సమయంలో  కాంగ్రెస్ పార్టీ ఐదేళ్లు  ప్రత్యేకహెుదా ఇస్తామని చెబితే.... బీజేపీ పాలకులు పదేళ్లు  ఇస్తామని చెప్పి చివరకు మట్టి నీళ్ళు అదించారని విరుచుకుపడ్డారు. రాష్ట్ర అభివృద్ధికోసం మార్చి 1వ తేదీ ఒక డిక్లరేషన్ చేయబోతున్నామన్నారు. ఆంధ్రప్రదేశ్​ అభివృద్ది కోసం  కాంగ్రెస్ పార్టీని  బలపరచాలని వైఎస్​ షర్మిల  పిలుపు ఇచ్చారు.