పదో తరగతి పరీక్షా ఫలితాల కోసం ఎదురు చూస్తున్న విద్యార్థులకు శుభవార్త చెప్పింది విద్యాశాఖ. ఏప్రిల్ 22న ఉదయం 11గంటలకు విద్యాశాఖ కమిషనర్ ఫలితాలు ప్రకటిస్తారని తెలిపారు విద్యాశాఖ అధికారులు. ఫలితాలను అధికారిక వెబ్సైట్ RESULTS.BSE.AP.GOV.IN నుండి డౌన్లోడ్ చేసుకోగలరని తెలిపారు అధికారులు.
మార్చి 18 నుండి 30వరకూ పదో తరగతి పరీక్షలు రాసిన 6లక్షల 16వేల మంది విద్యార్థులు భవితవ్యం 22న తేలనుంది. మరి, ఈసారి ఫలితాల్లో పైచేయి అమ్మాయిలదా,అబ్బాయిలదా వేచి చూడాలి.