భద్రాచలం, వెలుగు : ఏపీలోని విలీన ఎటపాక మండలం పురుషోత్తపట్నం గ్రామంలో అక్రమణలకు గురవుతున్న భద్రాచలం సీతారామచంద్రస్వామి దేవస్థానం భూముల వ్యవహారం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని ఏపీ ఎస్టీ కమిషన్ చైర్మన్ శంకర్రావు తెలిపారు. భద్రాచలం సీతారామచంద్రస్వామిని మంగళవారం ఆయన దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ భూముల ఆక్రమణలపై పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని దేవస్థానం ఆఫీసర్లు ఆయన దృష్టికి తీసుకొచ్చారు. కాగా తక్షణమే దీనిపై చర్యలు తీసుకునేలా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తానని ఆయన హామీ ఇచ్చారు.