గుడికోటలో ఏపీ టీడీపీ నేత ప్రత్యేక పూజలు

రాయికల్, వెలుగు: కేంద్ర మాజీ మంత్రి, టీడీపీ సీనియర్​ నాయకుడు అశోక్​గజపతిరాజు రాయికల్​ పట్టణంలోని గుడికోట ఆలయంలో బుధవారం  ప్రత్యేక పూజలు నిర్వహించారు.

శ్రీ చెన్నకేశవనాథ పంచముఖ శివలింగాన్ని దర్శించుకొని తీర్థ, ప్రసాదాలు స్వీకరించారు. ఆయనను మున్సిపల్​ చైర్మన్​ మోర హన్మండ్లు, ట్రస్టు ప్రతినిధి హిమవంతరావు, మాజీ ఎంపీపీ గంగారెడ్డి సన్మానించారు. కాగా ఇటిక్యాల గ్రామంలో జరుగుతున్న సాయిబాబా దేవాలయ వార్షికోత్సవంలోనూ 
ఆయన పాల్గొన్నారు.