టెట్ నోటిఫికేషన్ విడుదల చేసింది ఏపీ సర్కార్. మెగా డీఎస్సీ ద్వారా 16,347 టీచర్ పోస్టుల భర్తీకి ఇటీవల ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో టెట్ నోటిఫికేషన్ విడుదల చేసింది ప్రభుత్వం.టీచర్ పోస్టుల భర్తీకి క్యాబినెట్ కూడా ఆమోదం తెలిపిన క్రమంలో త్వరలోనే డీఎస్సీ నోటిఫికేషన్ కూడా విడుదల కానుంది.
డీఎస్సీ పరీక్ష నిర్వహించడానికి ముందే డీఎస్సీకి అర్హత అయిన టెట్ పరీక్షను నిర్వహించనుంది ప్రభుత్వం.డీఎస్సీలో టెట్ మార్కులకు 20శాతం వెయిటేజీ ఉండనుంది. రేపటి నుండే టెట్ కి సంబంధించి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం కానుంది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అధికారిక వెబ్సైటులో ఉంచింది ప్రభుత్వం.