ఏపీ టెట్ హాల్ టికెట్లు విడుదలయ్యాయి.. ఇలా డౌన్ లోడ్ చేసుకోండి..

ఏపీ టెట్ హాల్ టికెట్లు విడుదలయ్యాయి.. ఇలా డౌన్ లోడ్ చేసుకోండి..

ఆంధ్రప్రదేశ్ టీచర్ ఎలిజిబి లిటీ టెస్ట్ పరీక్ష హాల్ టికెట్లు విడుదలయ్యాయి..  వ్రాత పరీక్షలు అక్టోబర్ 3వ తేదీ నుంచి  20వ తేదీ వరకు  జరుగుతాయి. ఈ పరీక్షలను కంప్యూటర్ బేస్డ్ టెస్టు విధానంలో నిర్వహించనున్నారు. టెట్ అధికారిక వెబ్ సైట్ నుంచి హాల్ టికెట్స్ ను డౌన్ లోడ్ చేసుకోవాలని అధికారులు సూచించారు. టెట్ పరీక్షలు రెండు సెషన్లలో 18 రోజులు పాటు జరుగుతాయి. మొదటి సెషన్ ఉదయం 9.30గంటల నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు జరుగుతుంది.  రెండో సెషన్ మధ్యా హ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు జరుగుతుంది. 

హాల్ టికెట్లు  ఎలా డౌన్ చేసుకోవాలంటే...

  •  ఏపీ టెట్ అభ్యర్థులు https://aptet.apcfss.in/# వెబ్ సైట్లోకి వెళ్లాలి.
  •  హోం పేజీలో కనిపించే AP TET Hall Tickets(July) 2024 అనే ఆప్షన్ పై క్లిక్ చేయాలి
  •  అభ్యర్థి  ID, పుట్టిన తేదీతోపాటు వెరిఫికేషన్ కోడ్ ను ఎంటర్ చేయాలి. -లాగిన్ పై క్లిక్ చేస్తే టెట్ హాల్ టికెట్ డిస్ల్పే అవుతుంది. -
  • ప్రింట్ లేదా డౌన్ లోడ్ ఆప్షన్ పై నొక్కి కాపీని తీసుకోవాలి. -పరీక్ష కేంద్రంలోకి వెళ్లాలంటే హాల్ టికెట్ తప్పని సరిగా ఉండాలి.