ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలోని పాఠశాల విద్యాశాఖ 'ఉపాధ్యాయ అర్హత పరీక్ష' (ఏపీ టెట్ జులై-2024) నోటిఫికేషన్ విడుదల చేసింది. టెట్ స్కోర్‌కు జీవిత కాల గుర్తింపు ఉంటుంది.
అర్హతలు: పేపర్‌ను బట్టి ఇంటర్మీడియట్, బ్యాచిలర్స్ డిగ్రీ, మాస్టర్స్ డిగ్రీతో పాటు డీఈడీ/ బీఈడీ/ లాంగ్వేజ్ పండిట్ లేదా తత్సమానం. ప్రస్తుత విద్యా సంవత్సరం చివరి ఏడాది చదివే అభ్యర్థులూ అర్హులే.
ఎగ్జామ్ ప్యాటర్న్: ఆన్‌లైన్‌లో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (సీబీటీ)గా నిర్వహిస్తారు. పేపర్-1 ఎ, పేపర్-1 బి: 5 విభాగాల్లో 150 ప్రశ్నలు- 150 మార్కులకు నిర్వహిస్తారు. పేపర్-2 ఎ, పేపర్-2 బి: 4 విభాగాల్లో మొత్తం 150 ప్రశ్నలు- 150 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు.
దరఖాస్తులు: అభ్యర్థులు ఆన్‌లైన్‌లో జులై 4 నుంచి జులై 17 వరకు దరఖాస్తు చేసుకోవాలి. పరీక్షలు ఆగస్టు 5 నుంచి ఆగస్టు 20 వరకు నిర్వహిస్తారు.