తిరుమల లడ్డూ వివాదంపై జ్యుడీషియల్ విచారణ జరిపించాలి: ఏపీ విశ్వహిందూ పరిషత్

తిరుమల లడ్డూ వివాదంపై జ్యుడిషియల్ విచారణ జరిపించాలన్నారు  ఏపీ  విశ్వ హిందూ పరిషత్ అధ్యక్షుడు తనికెళ్ళ సత్య హరికుమార్. హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయన్నారు..నిందితులు ఎవరైనా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ రెండు నెలలు చేశారో  ప్రభుత్వం ఏ చేసిందో చెప్పాలన్నారు. ధార్మిక అపచార జరగకుండా  చర్యలు తీసుకున్నామని ఆలయ ఈవో గానీ..సీఎం ఇప్పటి వరకు చెప్పలేదన్నారు. 

ఆహార నాణ్యత విలువలు పాటించకపోతే బాధ్యులపై క్రిమినల్ కేసులు పెట్టాలన్నారు. రాజకీయ కోణంలో చూడకుండా చర్యలు తీసుకోవాలన్నారు. స్వామీజీలు,పీఠాధిపతులతో చర్చించి నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు. వెంటనే సంప్రోక్షణ కార్యక్రమం చేపట్టాలన్నారు. 

ALSO READ | నీ ఆరోపణలను ఎప్పుడైనా నిరూపించారా : సీఎం చంద్రబాబుకు ఎంపీ విజయసాయి ప్రశ్నలు