మరుగుజ్జు గెలాక్సీలను కనుగొన్న ఏపీ మహిళా సైంటిస్ట్ టీమ్

మరుగుజ్జు గెలాక్సీలను కనుగొన్న  ఏపీ మహిళా సైంటిస్ట్ టీమ్
  • మధ్యస్థాయి బ్లాక్ హోల్​కు సంబంధించి భారీ శాంపిల్స్.. 
  • రాగ దీపిక(ఆస్ట్రోఫిజిసిస్ట్)   నేతృత్వంలో  ఏపీ మహిళా సైంటిస్ట్ టీమ్

విజయవాడ: భారత సంతతికి చెందిన మహిళా సైంటిస్ట్  (ఆస్ట్రోఫిజిసిస్ట్) రాగ దీపిక నేతృత్వంలోని టీం.. మధ్యస్థాయి బ్లాక్ హోల్ కు సంబంధించిన భారీ శాంపిల్స్ తో పాటు మరుగుజ్జు గెలాక్సీలను కనుగొంది. అంతేకాకుండా ఈ గెలాక్సీల్లో ఒక బ్లాక్ హోల్  యాక్టివ్ గా ఉందని గుర్తించింది. 

ప్రస్తుత బ్లాక్ హోల్స్, మరుగుజ్జు గెలాక్సీల కన్నా తాము కనుగొన్న శాంపిల్స్  మూడు రెట్లు పెద్దవని శాస్త్రవేత్తలు తెలిపారు. తమ అధ్యయనంతో మరుగుజ్జు గెలాక్సీల పరిణామక్రమం, బ్లాక్ హోల్స్ ల అభివృద్ధిపై మరింత లోతైన పరిశోధనలు చేయవచ్చని చెప్పారు. అలాగే, విశ్వంలోని మొట్టమొదటి బ్లాక్ హోల్స్  పరిణామంపైనా స్టడీ చేయడానికి తమ అధ్యయనం పనికివస్తుందని పేర్కొన్నారు. డార్క్  ఎనర్జీ స్పెక్ట్రోస్కోపిక్  ఇన్ స్ట్రుమెంట్  నుంచి డేటాను ఉపయోగించి దీపిక టీం.. భారీ శాంపిల్స్ ను కంపైల్  చేసింది. కాగా.. రాగ దీపిక తల్లిదండ్రులది ఏపీ. గుంటూరు జిల్లా తెనాలిలో నివాసం వారు నివాసం ఉంటున్నారు.