వన్ నేషన్ వన్ డేటాకు అపార్ తప్పనిసరి: ఉన్నత విద్యా మండలి సెక్రటరీ శ్రీరాం వెంకటేశ్

వన్ నేషన్ వన్ డేటాకు అపార్ తప్పనిసరి: ఉన్నత విద్యా మండలి సెక్రటరీ శ్రీరాం వెంకటేశ్

హైదరాబాద్, వెలుగు: వన్ నేషన్.. వన్ డేటాకు అపార్ ఐడీ తప్పనిసరి అని తెలంగాణ హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ సెక్రటరీ శ్రీరామ్ వెంకటేశ్ తెలిపారు. బీఆర్ అంబేద్కర్ ఓపెన్ వర్సిటీలోని 75 శాతం స్టూడెంట్లకు అపార్ ఐడీ క్రియేట్ చేయడం హర్షణీయమన్నారు. హైదరాబాద్​లోని అంబేద్కర్ ఓపెన్ వర్సిటీలో అపార్ అమలుపై రెండ్రోజులుగా జరుగుతున్న వర్క్ షాప్ మంగళవారం ముగిసింది.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న శ్రీరామ్ వెంకటేశ్ మాట్లాడుతూ.. తెలంగాణలోని ఇతర యూనివర్సిటీలకు ఓపెన్ వర్సిటీ మార్గదర్శిగా నిలిచిందన్నారు. డిజీ లాకర్, అకాడమిక్ బ్యాంక్ అఫ్ క్రెడిట్ (ఏబీసీ), అపార్ ఐడీ వంటివి స్టూడెంట్ చదువుకున్న విషయాలకు సంబంధించి కీలకమైన అంశాలుగా ఆయన తెలిపారు. విద్యార్థులు తమ చదువు పూర్తయ్యాక ఉద్యోగం కోసం ఏ సంస్థ వద్దకు వెళ్లినా.. సర్టిఫికెట్ల పరిశీలన సులభం అవుతుందన్నారు. సర్టిఫికేట్ ఒరిజినలా, లేక ఫేక్ సర్టిఫికెటా అనేది కూడా ఎలాంటి ఖర్చు లేకుండా తేలిపోతుందని వెల్లడించారు.