అపార్ అవస్థలు.. కామారెడ్డి జిల్లాలో 61. 62 శాతమే పూర్తి

 అపార్ అవస్థలు.. కామారెడ్డి జిల్లాలో 61. 62 శాతమే పూర్తి
  • విద్యార్థుల అపార్ నమోదులో తలెత్తుతున్న సమస్యలు
  • స్కూల్, కాలేజీ రికార్డుల్లో తేడాలు, ఆధార్​లో తప్పులుంటే రిజెక్ట్​
  • బర్త్​ సర్టిఫికెట్, ఫోన్​ నంబర్​ అప్​డేట్ వంటి చిన్నిచిన్న సమస్యలతో సతమతం 
  • ప్రీ–ప్రైమరీ నుంచి ఉన్నత చదువులు, ఆక్టివిటీస్​వివరాలన్నీ ఆన్​లైన్​లో నమోదు

కామారెడ్డి , వెలుగు ‘ఒక దేశం, ఒక స్టూడెంట్ ఐడీ కార్డు’ పేరుతో కేంద్ర ప్రభుత్వం అపార్​(ఆటోమేటెడ్​ పర్మినెంట్ అకాడమిక్​ అకౌంట్​రిజిస్ట్రీ)ని తీసుకొచ్చింది. ప్రీ-ప్రైమరీ నుంచి ఉన్నత విద్య, విద్యార్థుల ఆక్టివిటీస్​వివరాలన్నీ ఆన్​లైన్​లో నమోదు చేసి దేశ పౌరులకు  ఆధార్​కార్డులా విద్యార్థులకు ఒక నంబర్​తో అపార్​ ఐడీ కార్డులను ఇవ్వనున్నారు.

ప్రైమరీ స్థాయి నుంచి ఉన్నత చదువులు కంప్లీట్ అయ్యే వరకు ఈ నంబర్​ ఉంటుంది.  క్లాసుల వారీగా వచ్చిన మార్కులు,   ఉత్తీర్ణత వివరాలు,  స్పోర్ట్స్, ఇతరత్రా యాక్టివిటీ, వారికి  వచ్చిన అవార్డుల వంటి వివరాలన్నీ  ఉంటాయి. విద్యా సంస్థల్లో అపార్ ఎంట్రీ పక్రియ గత 3 నెలలుగా జరుగుతోంది.  అయితే చిన్నచిన్న సమస్యలు తలెత్తుతుండడం వల్ల కామారెడ్డి జిల్లాలో అపార్ ఎంట్రీ 61.62 శాతమే పూర్తైంది. 

టెక్నికల్​గా ఇబ్బందులు..

అపార్​లో స్టూడెంట్స్​ వివరాలు ఎంట్రీ చేసేటప్పుడు పూర్తి సమాచారం ఉండాలి.  స్కూల్, కాలేజీ అడ్మిషన్​ రికార్డుల్లో తేడాలు, బర్త్​ సర్టిఫికెట్​, ఆధార్​లో విద్యార్థి, తల్లిదండ్రుల పేర్లలో అక్షర దోషాలు, గ్రామం వివరాలు, ఫోన్​ నంబర్​ అప్​డేట్ వంటి కరెక్షన్స్​ ఉంటే అపార్​లో వివరాలు నమోదు కావడం లేదు. 

ప్రైమరీ, హైస్కూల్, కాలేజీల్లో  ఉండే అడ్మిషన్ రికార్డులు ఒకేలా ఉండాలి. లేకపోతే అపార్​ ఎంట్రీ కావట్లేదు.  వీటన్నింటి సవరణకు బర్త్​ సర్టిఫికెట్ తప్పనిసరి. ప్రస్తుతం ఎగ్జామ్స్ నిర్వహిస్తుండగా,  ఎండకాలం సెలవులు కూడా వస్తున్నాయి.  హాలిడేస్​ తర్వాతే టార్గెట్​ కంప్లీట్ 
అయ్యే వీలుంది. 

జిల్లాలో పరిస్థితి..

నర్సరీ నుంచి ఇంటర్మీడియట్ వరకు జిల్లాలో 1,71,542 మంది స్టూడెంట్స్ ఉన్నారు.  ఇప్పటి వరకు 1,05,699 మంది స్టూడెంట్స్​కు అపార్ జనరేట్​ అయ్యింది.  ఎంట్రీ చేసిన దాంట్లో 873 మంది స్టూడెంట్ప్​ వివరాలు ఆన్​లైన్​లో ఫెయిల్​ అయ్యాయి.  రికార్డుల తేడాతో ఆన్​లైన్​ కంప్లీట్ కాలేదు. ఇంకా 64,956 మంది స్టూడెంట్స్​ వివరాలు నమోదు చేయాల్సి ఉంది.  జిల్లాలో  గవర్నమెంట్​ స్కూల్స్​ 1013, ప్రైవేట్ స్కూల్స్​ 168,   గవర్నమెంట్​, ప్రైవేట్​ జూనియర్​ కాలేజీలు 42 ఉన్నాయి.  కేజీబీవీ, రెసిడెన్షియల్​ స్కూల్స్​,  మాడల్​ స్కూల్స్​ ఉన్నాయి.  వీటన్నింటిలో  చదువుతున్న స్టూడెంట్స్​ వివరాలను అపార్​ చేయించడాన్ని జిల్లా విద్యా శాఖ పర్యవేక్షిస్తోంది.

గవర్నమెంట్, ప్రైవేట్​ స్కూల్స్, కాలేజీల్లో ఎంట్రీ చేస్తున్నారు.  1,71,542 మందికి గాను ఇప్పటి వరకు 1,05,6 99 ( 61.62 శాతం)  మంది వివరాలు అపార్​కు యాడ్​ అయ్యాయి.  ఇంకా  64,956  మంది ( 38. 39 శాతం)  వివరాలు ఎంట్రీ కావాల్సి ఉంది.   873 మంది వివరాలను అపార్​ రిజెక్టు చేసింది.  ఆధార్ అప్​డేట్స్​ చేయడానికి త్వరలో  ఒక్కో మండలంలో కొన్ని స్కూల్స్​ సెలెక్టు చేసి ఇక్కడ  క్యాంపులు ఏర్పాటు చేసే అవకాశముంది.  అపార్​ కంప్లీట్​ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని కోఆర్డినేటర్​ రమణరావు పేర్కొన్నారు.