జూన్​ 2 అపర ఏకాదశి.. పొరపాటున కూడా ఈ పనులు చేయొద్దు..

జూన్​ 2 అపర ఏకాదశి.. పొరపాటున కూడా ఈ పనులు చేయొద్దు..

హిందూ మతంలో, అపర ఏకాదశి పండుగను ప్రతి సంవత్సరం వైశాఖ మాసంలోని కృష్ణ పక్ష ఏకాదశి రోజున జరుపుకుంటారు. అపర ఏకాదశి విష్ణువుకు అంకితం చేసిన రోజు. ఈ ఏకాదశిని ఈ ఏడాది జూన్ 2న 2024లో జరుపుకోనున్నారు. అపర ఏకాదశి రోజున ఉపవాసం ఉండి, విష్ణుమూర్తిని పూజించడం వల్ల పాపాలు నశించి మోక్షం లభిస్తుందని నమ్మకం. అయితే అపర ఏకాదశి రోజున పొరపాటున కూడా కొన్ని పనులు చేయవద్దని పండితులు చెబుతున్నారు.  ఇప్పుడు ఆ పనులు ఏవో తెలుసుకుందాం...

 అపర ఏకాదశి రోజున శ్రీమహావిష్ణువును ఆరాధించడం ద్వారా ప్రజల కోరికలన్నీ నెరవేరుతాయని నమ్ముతారు. అంతే కాకుండా గ్రహ దోషాలు కూడా పరిష్కారమవుతాయని భక్తులు నమ్ముతారు.అపర ఏకాదశి వ్రతంలో ప్రజలు కొన్ని ప్రత్యేక విషయాలలో శ్రద్ధ వహించాలంటున్నారు పండితులు. ఎందుకంటే చిన్న పొరపాటు వల్ల ఉపవాస ఫలితం దక్కదంటున్నారు.  ముఖ్యంగా అవివాహిత స్త్రీలు ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల శుభం కలుగుతుంది. సంపదను పెంచుకోవడానికి కూడా ఈ ఉపవాసం ఉపయోగపడుతుందని అంటున్నారు.  అపర ఏకాదశి రోజున కొన్ని పనులు చేయడం నిషిద్ధమని భావిస్తున్నారు. దీని కారణంగా ఉపవాసం పూర్తిఫలితాలు రావు. జీవితంలో సమస్యలకు దారితీయవచ్చు.

జూన్​ 2న పొరపాటున కూడా ఈ పనులు చేయకండి..

  • అపర ఏకాదశి రోజున అన్నం, ఉసిరికాయ, పప్పు, వెల్లుల్లి, ఉల్లి, ఉప్పు తినడం నిషిద్ధం.
  • ఏకాదశి రోజున బ్రహ్మచర్యం పాటించడం చాలా ముఖ్యం.
  • ఏకాదశి రోజున మాంసాహారం, మద్యం, పొగాకు సేవించడం మహాపాపం.
  • నిజం మాట్లాడటం, మధురంగా ​​మాట్లాడటం ఏకాదశి రోజున మంచిదని భావిస్తారు.
  • ఏకాదశి రోజున కోపం, దురాశలకు దూరంగా ఉండాలి. అంతే కాకుండా ఎవరినీ అవమానించకండి.

చేయాల్సినవి ఇవే..

  • అపర ఏకాదశి రోజున ఉపవాసం ఉండేవారు సూర్యోదయానికి ముందే నిద్రలేచి స్నానం చేసి శుభ్రమైన దుస్తులు ధరించాలి.
  • అప్పుడు వారు విష్ణువును పూజించాలి. అవకాశం ఉంటే విష్ణు సహస్రనామం పఠించండి. 
  •  "ఓం నమః శివాయ" అనే  పంచాక్షరీ మంత్రాన్ని  కూడా జపం చేయవచ్చు.
  • రాత్రిపూట భజన కీర్తనలు చేయండి. విష్ణువును ధ్యానించండి.

అపర ఏకాదశి ప్రాముఖ్యత..

అపర ఏకాదశి నాడు శ్రీమహావిష్ణువును, లక్ష్మీదేవిని కలిసి పూజించడం ద్వారా మహిళలు సద్గతిని పొందుతారు. విష్ణువుకు పసుపు రంగు బట్టలు, ఆహారాన్ని సమర్పించాలి. ఈ వ్రతాన్ని పాటించడం వల్ల పాపాలు తొలగిపోతాయని చెబుతున్నారు. అంతే కాదు వ్యక్తి అనేక రకాల వ్యాధులు, దోషాలు, ఆర్థిక సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు. అనంతమైన పుణ్యాలను పొందవచ్చు. ఇంట్లో ఎల్లప్పుడూ ఆనందం, శ్రేయస్సు ఉంటుంది.